శిల్పారామంలో 19 నుంచి ‘మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో’..!

Publish Date:Sep 17, 2026

Advertisement

తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ‘మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో’ నిర్వహించను న్నట్లు తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) సి. గోపికన్నన్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పూంపు హార్ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు రూపొందించిన అరుదైన, ఆకర్షణీయమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడంతో పాటు కళాకారులకు మార్కెట్‌ను కల్పించడం, తమిళనాడు హస్తకళల గొప్ప వారస త్వాన్ని ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని గోపికన్నన్ వివరించారు. 

ఈ నెల 19న ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమం జరగనుంది. తమిళనాడు ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పి. మధన్ రాజా ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి తమిళ నాడు హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. అమృత జ్యోతి హాజరు కాను న్నారు. ఎక్స్‌పోలో తమిళనాడు కళాకారుల ప్రతిభకు అద్దం పట్టేలా విభిన్న రకాల హస్తకళా ఉత్పత్తులు అందుబాటు లో ఉండనున్నాయి. కాంస్య విగ్రహాలు, ఇత్తడి సంప్రదాయ దీపాలు, తంజావూరు చిత్రాలు, తంజావూరు ఆర్ట్ ప్లేట్లు, పేపియర్-మాచే బొమ్మలు, చెక్క శిల్పాలు, రాతి శిల్పాలు, ఇత్తడి కళాఖం డాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

అలాగే మట్టి, టెర్రకోట ఉత్ప త్తులు, చెరకు/కేన్ ఫర్నిచర్, అరటి నార ఉత్పత్తులు, జనపనార (జ్యూట్) ఉత్పత్తులు, తాటి ఆకులతో తయారు చేసిన వస్తువులు, ఫ్యాషన్ ఆభరణాలు, ధూప ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు కూడా ప్రదర్శన లో అందుబాటులో ఉంటాయి. చేతితో తయారు చేసిన వస్త్రాలు, చేనేత ఉత్పత్తులతో పాటు మరెన్నో సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను ఈ ఎక్స్‌పోలో సందర్శకులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని గోపికన్నన్ తెలిపారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగు తున్న కళలు, కళాకారుల నైపుణ్యాన్ని ఒకే వేదికపై చూడటానికి ఈ ప్రదర్శన అవకాశం కల్పిస్తుందని గోపికన్నన్ పేర్కొన్నారు.

 

 

 

[ Mega Handicrafts Expo, Tamil Nadu, Shilparam, Crafts, Minister P. Madhan Raja, Telangana goverment, CM Revanth reddy, TeluguOne News ]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.