మేకపాటితో పోటీపడేదెవరో?

Publish Date:Apr 6, 2012

Advertisement

నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డిని సమర్థవంతంగా ఢీకొనే అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్వేషిస్తూనే ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున బొల్లినేని వెంకటరామారావు పేరు ఖరారైంది. ఒకవైపు బొల్లినేని, మరోవైపు మేకపాటి ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉండగా మరోవైపు కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక తలలు పట్టుకుని కూర్చున్నారు. ఉదయగిరి నియోజకవర్గం బాధ్యతలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అధిష్టానం అప్పగించింది.

 

దీంతో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని తన సత్తా చాటుకోవాలన్న కృతనిశ్చయంతో రామనారాయణ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గ అభ్యర్థికోసం ఎడతెగ ని చర్చలు జరుపుతున్నారు. మాజీ మంత్రి మాదాల జానకీ రామ్, జడ్ పి మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్, జలదంకి మాజీ ఎంపిపి కావేరి కృష్ణారెడ్డి, పుటం బ్రహ్మానందరెడ్డి, సీతారాంపురం మాజీ జడ్ పి టి సి సభ్యుడు గురువారెడ్డి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కమ్మంపాటి తదితరులు టిక్కెట్లను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న పుటం బ్రహ్మానందరెడ్డి, మేకపాటి సమీప బంధువు. అంతేకాకుండా ఆయనకు నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం పరంగా గట్టి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. గతంలో మేకపాటి కుటుంబంతో కలిసి ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కూడా బ్రహ్మానందరెడ్డికి ఉంది. అందువల్ల మేకపాటి ఎత్తులకు పై ఎత్తులు వేసి ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా బ్రహ్మానందరెడ్డికి ఉందని కాంగ్రెస్ పార్టీ అధిస్థానం అంచనావేస్తోంది. ఫలితంగా టిక్కెట్లు ఆశిస్తున్నవారి జాబితాలో బ్రహ్మానందరెడ్డి పేరు అగ్రస్థానాన నిలిచింది. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థి ఎవరన్నది సందిగ్థంలో పడటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటూ పాలుపోక కొట్టుమిట్టాడుతున్నారు.

By
en-us Political News

  
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.