జూలై కంటే ముందే జరగనున్న ఆంద్రప్రదేశ్ ఉపఎన్నికలు
Publish Date:Apr 7, 2012
Advertisement
ఆంద్రప్రదేశ్ ఉపఎన్నికలు 2012: ఆంధ్రప్రదేశ్ లోని 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జూలై కంటే ముందే జరగనున్నాయి. రాష్ట్రపతి పదవికాలం జూలై 24 ముగుస్తండంతో, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్.వై.ఖురేషీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల్లోగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికలు జూలై 15 నుంచి 22 మధ్యలో ఉంటాయి. రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియలో ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు. ఎమ్మెల్యేలందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా రాష్ట్రపతి ఎన్నికల ముందే ఉప ఎన్నికలు నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-18-seats-by-elections-24-13226.html
http://www.teluguone.com/news/content/ap-18-seats-by-elections-24-13226.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026





