కేసీఆర్ ఫాంహౌస్ భూముల వివాదం.. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు..!

Publish Date:Sep 17, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రెవెన్యూ శాఖ అధికారులు అత్యంత వేగంగా రంగంలోకి దిగారు. గజ్వేల్ ఆర్డీఓ, మర్కుక్ ఎమ్మార్వో, ఏడీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఎర్రవల్లి, శివారు వెంకటపూర్, వరదరాజుపూర్ గ్రామాల సరిహద్దుల్లో భూముల పరిశీలన విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 325 సర్వే నెంబర్‌లోని అసైన్డ్ భూముల అంశంపై అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. 1944 నాటి సర్వే రికార్డుల ప్రకారం ఎర్రవల్లి గ్రామాన్ని ఆనుకొని మొత్తం 2,447 ఎకరాల భూమి ఉండగా, దాని సరిహద్దులో వెంకటాపురం గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల సరిహద్దుల మధ్య దాదాపు 300 ఎకరాల భూమి ఓవర్‌లాపింగ్‌లో నమోదై ఉండటం, ఆ వివాదం 1957 నుంచి నలుగుతుండటం గమనార్హం.

ఈ వివాదాస్పద భూముల లెక్కలపై శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ సమయంలో రికార్డులను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సరిగ్గా ఇదే అదనుగా భావించి, ఆ 300 ఎకరాలు కొనుగోలు చేసినట్లు కాగితాలు సృష్టించి ఒక్క కలం పోటుతో కేసీఆర్ యజమాని అయిపోయారని విమర్శించారు. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫాంహౌస్‌లో కేవలం 295 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు చూపించారని తెలిపారు. అయితే, రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో ఏకంగా 388 ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్‌ భూమి ఉందని, 2017 నాటి డిలీషన్ అండ్ అప్‌డేషన్ పేరుతో ఆ భూమిని రికార్డుల నుంచి మాయం చేశారని పేర్కొన్నారు.

అధికారికంగా ఉన్న 295 ఎకరాలు కాకుండా ఎలాంటి పత్రాలు లేని సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కంచె వేసి కలిపేసుకోవడం ద్వారా దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో భారీ సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులకు సరిగ్గా 30 రోజుల గడువును ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నెల రోజుల వ్యవధిలోగా పూర్తి స్థాయి విచారణ జరిపి, ఫాంహౌస్ వాస్తవ విస్తీర్ణం ఎంత, అందులో కలిసిన ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎంత అనే లెక్క తేల్చాలని ఆదేశించారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులతో పాటు బాధ్యులైన మంత్రులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో, రెవెన్యూ శాఖలో ప్రకంపనలు రేగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ క్షేత్రస్థాయి విచారణ మరియు తనిఖీల నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

 

 

 

[ Kcr Erravalli Farmhouse, CM Revanth reddy orders, Revenue department inspection, Telangana news, Gajwel rdo, Assigned Lands dispute, Minister Ponguleti Srinivas Reddy,  TeluguOne News ]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.