ఆ సీఎం నోటి నుంచి పొద్దున్నే మద్యం వాసన వచ్చేది..రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.!

Publish Date:Nov 4, 2026

Advertisement

పంజాబ్ రాజకీయాల్లో ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గడచిన కొద్దికాలంగా పెరిగిపోతున్న మత్తు పదార్థాల సంస్కృతిని అరికట్టడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన బహిరంగంగా ఆరోపించారు.సంగ్రూర్‌లో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

భగవంత్ మాన్ తన పక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పేవారని రాహుల్ పేర్కొన్నారు. అయితే ఉదయం 11 గంటల సమయానికే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరి వ్యక్తిగత అలవాట్లు వారి ఇష్టమని, తాను ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను విమర్శించడం లేదని రాహుల్ స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో తీవ్రంగా వేధిస్తున్న డ్రగ్స్ భూతాన్ని అంతం చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రతిరోజూ మత్తులో ఉంటే సమస్య ఎలా పరిష్కారమవుతుందని ఆయన నిలదీశారు.ఆప్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని రాహుల్ మండిపడ్డారు.

 పంజాబ్ పరిపాలన అంతా ఢిల్లీ నుంచి నడుస్తోందని, రాష్ట్ర రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతుల్లో ఉందని ఆరోపించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన కాలపరిమితిపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. మూడేళ్లలో డ్రగ్స్ సమస్యను పూర్తిగా తొలగిస్తామనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఎద్దేవా చేశారు.రాబోయే రోజుల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వయంగా ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత నాయకత్వం తీరును మార్చుకోకపోతే ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

 

[ Rahul Gandhi, Bhagwant Mann, Punjab politics, AAP government, drug menace Punjab, Sangrur Congress Rally, Arvind Kejriwal, Punjab Politics,  Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.