సీఈసీ జ్ణానేశ్ కుమార్ పై విజిలెన్స్ విచారణ: కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్.!

Publish Date:Nov 4, 2026

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ణానేశ్ కుమార్ పై  గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేరళ ప్రభుత్వం అధికారికంగా  అనుమతి ఇచ్చంది. ఆయన పీడబ్ల్యూడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో  2 కోట్ల  రూపాయల లంచం   డిమాండ్ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరోను కేరళ సర్కార్ ఆదేశించింది. 

 కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్   పనులకు సంబంధించి ఈ వివాదం తలెత్తింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన పాథిబెల్ సంస్థతో కలిసి పనిచేసిన ఇంజనీర్ లీ సీ బిన్‌కు రావాల్సిన చెక్కులు, పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు జ్ఞానేశ్ కుమార్ లంచం కోరారని కాంట్రాక్టర్  వీ.ఓ. సాజన్ గతంలో ఆరోపించారు. పనులన్నీ పూర్తయి ఇంజనీర్లచే ఆమోదం పొందిన సుమారు  17 కోట్ల రూపాయల విలువైన బిల్లులను చెల్లించకుండా నిలిపివేసి, వాటి క్లియరెన్స్ కు లంచం డిమాండ్ చేశారన్నది జ్ణానేశ్ కుమార్ పై ఆరోపణ. ఈ మేరకు  ఈ మేరకు  కాంట్రాక్టర్  వీ.ఓ. సాజన్  ఫిర్యాదు చేశారు. 

అధికారులు బిల్లులు విడుదల చేయకపోవడం, నిరంతరం ఇబ్బందులకు గురిచేయడంతో ఇంజనీర్ లీ సీ బిన్‌కు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారని సాజన్ వెల్లడించారు. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆయన మలేసియాలో ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  మరణించే ముందు ఆయన రాసిన సుసైడ్ నోట్‌లో కూడా పీడబ్ల్యూడీ అధికారుల వేధింపుల ప్రస్తావన ఉందని కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో తెలిపారు.  లీసీబిన్ సుసైడ్, లంచం ఆరోపణలపై జరిగిన విజిలెన్స్‌ విచారణ నిష్పాక్షపక్షంగా జరగలేదని, క్లీన్‌చిట్ ఇచ్చే ఉద్దేశంతోనే దర్యాప్తును ముగించారని  సాజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పదవిలో ఉన్నారు.  ఆయన గతంలో   సివిల్ సర్వీస్ లో ఉన్న కాలంలో  జరిగిన ఘటనలపై విచారణ చేపట్టడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం కూడా ఇలాంటి కేసుల్లో విచారణకు వెసులుబాటు ఉందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి లభించే రక్షణలు గతంలో వారు చేసిన అధికారిక విధులకు సంబంధించిన అవినీతి ఆరోపణల విచారణను నిరోధించలేవని ఈ ఉదంతంతో మరోసారి నిరూపితమైంది. 

తాజా పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో చట్టపరమైన నిబంధనల ప్రకారం ప్రాథమిక  వేగవంతం చేసేందుకు సమాయత్తమౌతోది.  ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం లేదా సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. 

[Kerala Vigilance Probe On CEC Gyanesh Kumar, Bribery Allegations, Kerala Government, Green Signal, Telugu  

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.