నషా వదిలిస్తున్న నిషేధం

Publish Date:Nov 16, 2016

Advertisement

 

పోయిన మంగళవారం మోడీ వేసిన నిషేధ మంత్రం సంజీవనిలా మారి ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఆర్ధిక భద్రత కోసం మోడీ తీసుకున్న నిషేద నిర్ణయం దేశభద్రతకి, సాదారణ జనాలు పడే అనేక ఇబ్బందులకి కూడా పరిష్కారాలు చూపిస్తుంది.

 

ఒక విషయం గమనించారా పోయిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు అంటే మోడీ 500, 1000 నోట్లు బాన్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు కాశ్మీర్ లోయలో ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదు. ఒక్క సారి కూడా నిరసనకారులు రాళ్ళూ రువ్వలేదు, ఒక్క స్కూల్ కూడా తగలపెట్ట లేదు...

 

అవును నిజమే కాని కాశ్మీర్ లో గొడవలు జరగకపోవడానికి మోడీ బాన్ చేసిన 500,1000 నోట్లకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది అక్కడ ఉన్న వేర్పాటు వాదులు ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్న యువతకి, పేదవారికి డబ్బులు ఇచ్చి ప్రసంగాలతో రేచ్చేగొట్టి నిరసనలు, దాడులు చేయించేవారు. భద్రత దళాలపై రాళ్ళు రువ్వితే 500, హింసాఖాండలో పాల్గొంటే 1000 రూపాయలు ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి అల్లకల్లోలం సృష్టించేవారు... కానీ ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగడం లేదు, కారణం మోడీ 500, 1000 నోట్ల రద్దు చెయ్యడం. నోట్ల రద్దు వలన  పాత నోట్లు తీసుకుని నిరసనలు చెయ్యడానికి నిరసనకారులు నిరాకరించడంతో, నిరసనకారులకు పంచడానికి కొత్తనోట్లు లేక పాత నోట్లు ఏమి చెయ్యాలో అర్ధం కాక వేర్పాటువాదులు  కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మూలుగుతున్న కోట్లకొద్దీ  పాత 500, 1000 నోట్లు (దొంగ నోట్లతో సహా) మూతి తుడుచుకోడానికి కూడా పనికి రాకుండా పోయాయి.

 

మోడీ దెబ్బకి ఎక్కడో ఆకాశంలో ఉన్న  రియల్ ఎస్టేట్ రెట్లు రేపో మాపో  నేల చూపులు చూడటానికి రెడీ అయిపోయ్యాయి. ఇంకా నిన్నటి వరకు ఎగిరిరేగిరిపడిన పసిడి పరిస్థితి ఐతే అమ్మడానికి అడవి, కొనడానికి కొరివిలా ఉంది. ఐటి నిఘా భయంతో కొనడానికి జనాలు, అమ్మడానికి వ్యాపారులు వెనక్కి తగ్గడంతో అమ్మకాలు లేక పసిడి రెట్లు  రెక్కలు తెగి అందుబాటులోకి వస్తున్నాయి. మోడీ నిర్ణయంతో ఇంకా నల్లబజారు కూడా బేజారు అవుతుంది. కట్టల కొద్దీ డబ్బులు దగ్గర ఉన్నాయి అని క్వింటాలకి క్వింటాలు నిత్యావసరాలు కొని గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుకుని డబ్బులు గుంజుకునే వారి ఆటలు కూడా ఈ దెబ్బకి, ఇంకా సాగకపోవచ్చు...నల్ల బజారు బాబుల దగ్గర  కట్లపాములు (అదేనండి నోట్ల కట్టలు) లేవు కనుక ఇంకా  నల్లబజారు నడక జోరు కాస్త అయిన తగ్గకపోదు, నిత్యావసరాలు కూడా అంతో ఇంతో అందుబాటులోకి రాకుండా మానవు.

 

మోడీ చేసిన ఈ పని వలన సాదారణ జనం ఇప్పుడు క్యూ లైన్లలో కొంత కష్టపడుతున్నా, భవిష్యత్తులో ఆమ్ అద్మి... తక్కువ కష్టాలతో ప్రశాంతంగా బతకవచ్చు అనే ఆశ అయితే పెట్టుకోవచ్చు (ఎంత అయినా మనిషి ఆశా జీవి కదా...)

By
en-us Political News

  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.