కాలుష్య భారతం: కాలుష్య నగరాల జాబితాలో ఇండియా టాప్.!

Publish Date:Oct 19, 2026

Advertisement

ఇండియాలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరింది. ప్రపంచంలో కాలుష్య నగరాల టాప్ 20 జాబితాలో  భారత నగరాలు ఏకంగా 13 ఉన్నాయి. అంతర్జాతీయ నివేదికలు ఈ విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి.   అత్యంత కాలుష్య  నగరాల గ్లోబల్ జాబితాలో ఇండియా టాప్ లో ఉంది. సోమవారం (అక్టోబర్ 13) విడుదలైన రియల్ టైమ్ డేటా ప్రకారం..  ప్రపంచంలోని టాప్ 2  కాలుష్య నగరాల జాబితాలో ఇండియాకు చెందిన  13 నగరాలు  ఉన్నాయి. అయితే, ఎప్పుడూ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో ఉంటూ వార్తల్లో నిలిచే   ఢిల్లీ   ఈ టాప్-20 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ నివేదిక దేశంలోని వివిధ నగరాల్లో వాయు నాణ్యత ఏ స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతుందో స్పష్టం చేస్తోంది. 

అందుబాటులోకి వచ్చిన రియల్ టైమ్ సమాచారం ప్రకారం, సోమవారం (అక్టోబర్ 19) డేటా మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.  ఇక్కడ వాయుకాలుష్యం ఇండెక్స్   198గా నమోదైంది.  ఇక త్రిపురలోని అగర్తలా   నాలుగో స్థానంలో నిలిచింది.  అలాగే రాజస్థాన్‌లోని పాలి, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లలో వాయుకాలుష్యం ఇండెక్స్ 174గా ఉంది. ఇక పోతే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ కూడా 174 ఏక్యూఐతో వాటితో సమానంగా నిలిచింది.  హర్యానాలోని రోహ్‌తక్ 172 ఏక్యూఐ నమోదు చేసింది. 

టాప్-20 జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న మిగతా నగరాల్లో రాజస్థాన్‌లోని కోటా, దేశ ఆర్థిక రాజధాని ముంబై, హాపూర్, హిసార్, బికనేర్,  బరేలీఉన్నాయి. ఈ నగరాలన్నీ గాలి నాణ్యత పడిపోయి తీవ్రమైన కాలుష్య వలయంలో చిక్కుకున్నట్లు ఈ రియల్ టైమ్ డేటా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో కూడా పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల రద్దీ, స్థానిక వాతావరణ మార్పుల కారణంగా గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

ఈ గ్లోబల్ జాబితాలో ఇండోనేషియాకు చెందిన నగరాలు కూడా అగ్ర స్థానాలలో ఉన్నాయి. సెంట్రల్ కలిమంతన్‌లోని పలంగ్‌కరాయ్  ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలవగా, పాలెంబాంగ్  రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు నగరాలు కూడా సివియర్ కాలుష్య కేటగిరీ కిందకు వస్తాయి. అలాగే ఇండోనేషియాలోని సంపిత్, జంబి నగరాలు వరుసగా 5,  6 స్థానాలను ఆక్రమించాయి. మలేషియాలోని పుత్రజయ, కౌలాలంపూర్, పెటాలింಗ್ జయ నగరాలు కూడా టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.  

ప్రస్తుత గ్లోబల్ టాప్-20 జాబితాలో ఢిల్లీ  కనిపించనప్పటికీ, రాజధాని నగరంలో గాలి నాణ్యత రాత్రికి రాత్రే క్షీణించడం ఆందోళన కలిగిస్తూనే ఉంది. అక్టోబర్ 19 ఉదయం 7:31 గంటల సమయంలో ఢిల్లీలో   ఎక్యూఐ గరిష్టంగా 191కి చేరుకున్నట్లు   డేటా గ్రాఫ్ వెల్లడించింది. అయితే ఆ తర్వాత మధ్యాహ్నానికల్లా ఆ కాలుష్య స్థాయి క్రమంగా తగ్గుముఖం పట్టింది.   ఉదయం పూట ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా పెరిగే కాలుష్యం, మధ్యాహ్నం గాలి వేగం పుంజుకోవడం వల్ల కొంతమేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.   

ఒక నగరంలో వాతావరణ కాలుష్యం అనేది స్థిరంగా ఉండదని, వివిధ గంటల్లో మారుతుంటుందని ఈ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఉద్గారాల విడుదల,  గాలి దిశ ఆధారంగా ఎక్యూఐ క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. రియల్ టైమ్ ర్యాంకింగ్‌లు కేవలం ఆయా సమయాల్లో లభించే ఒక స్నాప్‌షాట్ మాత్రమేనని, ప్రతి గంటకు ఇవి మారుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక రోజు గ్లోబల్ లిస్ట్‌లో పేరు లేనంత మాత్రాన ఆ ప్రాంతంలో గాలి స్వచ్ఛంగా ఉందని భావించడం సరికాదంటున్నారు.  

 యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాల ప్రకారం, 151 నుంచి 200 మధ్య ఉండే రీడింగ్‌లుఆరోగ్యానికి చేటు చేస్తుంది.  అదే విలువ 200 దాటితే  సివియర్ అన్ హెల్తీగా పరిగణించాల్సి ఉంటుంది.   గ్లోబల్ జాబితాలో పేరు లేకపోయినా, ఈ స్థాయి కాలుష్యం చిన్నారులు, వృద్ధులు,  శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై పడే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నగరాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ నియంత్రించడం, పారిశ్రామిక ఉద్గారాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయడం, చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని అరికట్టడం వంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ఈ కాలుష్య మహమ్మారిని తరిమికొట్టగలం.  

[Pollution in India, India Air Pollution, Most Polluted Cities India, AQI India cities, Delhi AQI,  Global Ranking, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.