సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్ధం: రతన్ టాటా బాటలోనే నోయెల్ టాటా.. పేదల వైద్యం కోసం 50 ఆస్పత్రులు.!

Publish Date:Oct 19, 2026

Advertisement

రతన్ టాటా సేవా వారస్వాన్ని నోయెల్ టాటా ముందుకు తీసుకు వెడుతున్నారు. భారత   వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా ప్రజా సంక్షేమ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన రతన్ టాటా వారస్వన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా కొనసాగిస్తున్నారు. ఆ దిశగా  ఓ  చారిత్రాత్మక ఘట్టానికి ఆయన శ్రీకారం చుట్టారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆశయాలను, ఆయన వదిలివెళ్లిన సేవా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా  నోయెల్ టాటా   దేశంలో సామాన్యులకు, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా  దేశ వ్యాప్తంగా  40 నుండి 50 ఆసుపత్రులను   నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రైవేటు వైద్యం అత్యంత ప్రియమైన ప్రస్తుత పరిస్ధితుల్లో.. నోయెల్ టాటా రూపొందించి అమలు చేయనున్న  ఈ ప్రాజెక్ట్ ఇండయన్ హెల్త్ కేర్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పునకు బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. 

ఈ ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలో వైద్య సదుపాయాలు సరిగా లేని ప్రాంతాలు, గ్రామీణ సరిహద్దులు,  మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం ధనికులకు మాత్రమే పరిమితం కాకూడదని, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి మెరుగైన చికిత్స అందాలన్న సదాశయంతో నోయెల్ టాటా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ  ఆసుపత్రుల నిర్మాణం ద్వారా అత్యాధునిక వైద్య పరికరాలు, అర్హత కలిగిన ప్రముఖ వైద్యులు,  సకల సౌకర్యాలతో కూడిన అత్యుత్తమ  వైద్య సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఇది సమాజంలో అల్పాదాయ వర్గాల  కుటుంబాల ఆరోగ్య సంరక్షణలో గేమ్ చేంజర్ గా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

ఈ భారీ ప్రాజెక్ట్‌ ద్వారా పేదలకు నిరంతరాయంగా, ఎఫెక్టివ్ గా సేవలందించేందుకు నోయెల్ టాటా ఒక వినూత్నమైన ఆర్థిక నమూనాను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం, ఆర్థిక స్థోమత ఉన్న రోగులు చెల్లించే సేవా రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిరుపేద రోగుల ఉచిత,  స్వల్ప రుసుము వైద్యానికి సబ్సిడీగా ఉపయోగిస్తారు. అంటే ఆసుపత్రికి వచ్చే సంపన్నులు పొందే వైద్య సేవల ద్వారా లభించే వచ్చే ఆదాయం..  పేద రోగులకు అందించే ఉచిత చికిత్సలకు నిధులుగా మారతాయి. ఈ  సెల్ఫ్ సస్టెయినింగ్ మోడల్ ఫండ్స్ వల్ల   ప్రభుత్వ నిధులు, విరాళాలపై   ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిరాఘాటంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను నిరంతరాయంగా అందించడానికి వీలవుతుంది. 

ముంబైలోని ప్రసిద్ధ టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇప్పటికే క్యాన్సర్ బాధితులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే.  ఆ స్ఫూర్తితో, అదే తరహా   సేవా దృక్పథాన్ని సాధారణ ఆసుపత్రుల విభాగానికి కూడా వర్తింపజేయాలన్నదే టాటా నోయెల్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.  కొత్తగా నిర్మించే 40 నంచి 50 ఆసుపత్రులలో కేవలం సాధారణ వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా, అత్యవసర వైద్యం, మాతాశిశు సంరక్షణ, ఆపరేషన్లు,  రోగనిర్ధారణ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. దీని వల్ల పేదరోగులు వైద్య చికిత్స కోసం నగరాలకు వెళ్లే అవసరం ఉండదు. స్థానికంగానే   కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది.   

రతన్ టాటా తన జీవితకాలంలో వ్యాపార విస్తరణతో పాటు  సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆయన మరణం తర్వాత టాటా ట్రస్ట్స్ సారథ్యాన్ని స్వీకరించిన నోయెల్ టాటా, రతన్ టాటా ఆశయాలను కొనసాగించడమే కాకుండా మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతున్నారు.  . టాటా గ్రూప్   లాభాల్లో అత్యధిక భాగాన్ని ట్రస్ట్స్ ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు.  . ఈ క్రమంలో నోయెల్ టాటా తీసుకున్న ఈ తాజా నిర్ణయం నిర్ణయం   సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్థం  అనే సూత్రానికి అద్దం పడుతోంది.  

   దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు లేవన్నది కాదనలేని వాస్తవం.అదే సమయంలో   ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య ఖర్చులు అసాధారణంగా పెరిగిపోయాయి. సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చికిత్స అన్నది తట్టుకోలేని ఆర్థిక సంక్షోభంగా మారింది.  వైద్య ఖర్చుల కారణంగా అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నపరిస్థితి.  ఇటువంటి తరుణంగా టాటా నోయెల్.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవను ఉచితంగా అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్  పేదల పాలిట సంజీవని అనడంలో సందేహం లేదు. 

ఈ   ఆసుపత్రుల నిర్మాణాన్ని వివిధ దశలలో   టాటా ట్రస్ట్స్ చేపట్టనుంది. తొలి దశలో అత్యంత వెనుకబడిన జిల్లాలు,  గ్రామీణ ప్రాంతాలో ప్రారంభించనున్నారు. ఆధునిక డిజిటల్ హెల్త్‌కేర్ సాంకేతికతలు, టెలిమెడిసిన్,  రోబోటిక్ వైద్య పరికరాలను కూడా ఈ ఆసుపత్రులలో వినియోగించేలా ప్రణాళికలురూపొందించారు.  రతన్ టాటా సేవా మార్గంలోని ముందుకు సాగుతూ..  నోయెల్ టాటా తీసుకున్న ఈ నిర్ణయం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు.  

[Noel Tata Take dorward Ratan Tata Legacy, Tata Trusts Hospitals, Tata Healthcare Initiative, Affordable Healthcare India, Business, Purpose, Society, Wellbeing, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.