పద్మశ్రీ ఏవీఎస్ రాజు ఇక లేరు: దార్శనిక పారిశ్రామికవేత్త అని కొనియాడిన చంద్రబాబు.!

Publish Date:Oct 14, 2026

Advertisement

నిర్మాణ రంగంలో విశేషమైన సేవలందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ) గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) ఇక లేరు.  కొంతకాలంగా వయోభారం కారణంగా వచ్చే  ఆరోగ్య సమస్యలతో తీసుకుంటున్న ఆయన మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి తుది శ్వాస విడిచారు.  ఆయన వయసు 89 ఏళ్లు. 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో జన్మించిన ఏవీఎస్ రాజు, తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అసాధారణ విజయాలను సాధించారు. సాధారణ స్థాయి నుంచి ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రత్యేకించి, 1990వ దశకంలో ఏవీఎస్ రాజు హైదరాబాద్‌లో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ  స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థను క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ దేశంలోని అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. 

దేశవ్యాప్తంగా అనేక భారీ ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సాగునీటి పనుల నిర్మాణంలో ఎన్‌సీసీ  అగ్రగామిగా నిలవడానికి ఏవీఎస్ రాజు అందించిన దార్శనిక నాయకత్వమే కారణం. వ్యాపార రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనను   పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.  

ఏవీఎస్ రాజు మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.    ఎన్‌సీసీ సంస్థను స్థాపించి, దానిని  ఉన్నత శిఖరాలకు చేర్చిన దార్శనిక పారిశ్రామికవేత్తగా ఏవీఎస్ రాజును చంద్రబాబు ప్రస్తుతించారు.  నిబద్ధత, నిజాయతీతో దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, స్ఫూర్తిమంతమని పేర్కొన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా ఎన్‌సీసీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో పేదలకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.

అలాగే  మంత్రి నారా లోకేశ్‌ కూడా ఏవీఎస్ రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఎన్‌సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో రాజు గారి కృషి ఎనలేనిదన్నారు. ఏవీఎస్ రాజు మంచి పద్య రచయిత అని పేర్కొన్న లోకేష్ పద్య రచయితగా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారని గుర్తు చేసుకున్నారు.  

[Padmasri AVS Raju Nomore, Nagarjuna Construction Company, NCC Group Founder, Padma Shri AVS Raju, Telugu One]

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.