తలసేమియా వ్యాధిగ్రస్తుల ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు: బెజవాడలో బ్లడ్ బ్యాంక్.!

Publish Date:Oct 16, 2026

Advertisement

సమాజ సేవ లక్ష్యంతో  ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిరంతరం వినూత్న కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. లాభాపేక్ష లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ, తాజాగా  తలసేమియా (రక్తహీనత)తో బాధపడుతున్న చిన్నారుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడలో   బ్లడ్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన కేంద్రం ద్వారా బాధితులకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందనున్నాయి.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా భువనేశ్వరి సమాజ సేవలో ముందుంటున్న విషయం తెలిసిందే. ఆమె నేతృత్వంలో  అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు భరోసా కల్పించే దిశగా ట్రస్ట్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులకు నిరంతరం అవసరమయ్యే రక్త మార్పిడి సేవలను సులభతరం చేసేందుకు విజయవాడ కేంద్రంగా ఈ నూతన బ్లడ్ బ్యాంక్‌  ఏర్పాటు చేశారు. 

తలసేమియా అనేది జన్యుపరమైన సమస్యల కారణంగా వంశపారంపర్యంగా వచ్చే తీవ్రమైన రక్తసంబంధిత వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు క్రమం తప్పకుండా రక్తాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే నిరుపేద కుటుంబాలకు ప్రతిసారీ రక్తాన్ని సమకూర్చుకోవడం, వైద్య ఖర్చులు భరించడం ఆర్థికంగా భారం ఈ దుస్థితిని నివారించడానికి  ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గతంలోనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రత్యేక తలసేమియా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు, రక్తమార్పిడి,  మందులను అందజేస్తోంది. ఇప్పుడు ఆ సేవలను మరింత విస్తరించేలా విజయవాడలోనూ సేవలు అందించడం ప్రారంభించింది.   

ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియా రోగులకు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షితమైన రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రక్త మార్పిడి ప్రక్రియతో పాటు అవసరమైన  మందులను కూడా ట్రస్ట్ ద్వారా ఉచిత అందజేయనున్నారు. వ్యాధిగ్రస్తులైన కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరాలు, కేంద్రాలు పనిచేస్తున్నాయి. నిరంతరం రక్తం అవసరమయ్యే ఈ వ్యాధి బాధితులకు ఈ సదుపాయం ఒక పెద్ద సాంత్వన చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. 

[NTR Trust Vijayawada Blood Bank, Thalassemia Patients Care, Nara Bhuvaneshwari, NTR Memorial Trust, Vijayawada Medical Services, Telugu One]

By
en-us Political News

  
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.