ఈ తప్పులే జగన్‌ను ముంచాయా..?

Publish Date:Aug 28, 2017

Advertisement

హోరాహోరిగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో సర్వేలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ విజయ దుంధుభి మోగించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 19 రౌండ్లు కౌంటింగ్ జరిగితే కేవలం ఒకే ఒక్క రౌండ్‌లో శిల్పా టీడీపీపై ఆధిక్యత సాధించగా..మిగిలిన రౌండ్లలో తెలుగుదేశం హవా స్పష్టంగా కనిపించింది. ఈ విజయం రాజకీయ విశ్లేషకులను ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఖంగు తినిపించింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి విజయం వైసీపీదేనని చాలా సర్వేలు చెప్పాయి..టీడీపీ గెలిచినా చాలా తక్కువ మెజార్టీ మాత్రమే వస్తుందని నిన్న, మొన్నటి లగడపాటి సర్వే తెలిపింది. అయితే టీడీపీకి ఇంతటి అఖండ విజయం సాధించడానికి ఒకేఒక్కడు కారణం..ఆ ఒక్కడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవును మీరు వింటున్నది నిజమే..ఆయన వ్యూహత్మకంగా చేసిన తప్పిదాలు సైకిల్‌కు రాచబాటను ఏర్పరిచి తెలుగుదేశం విజయానికి కారణమయ్యాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

అవేంటో ఒకసారి చూస్తే:

* నంద్యాలలో గెలుపే లక్ష్యంగా 11 రోజుల పాటు అక్కడే మకాం వేశారు జగన్..నాయకుడు అన్నవాడు మంది మార్భాలన్నీ జనంలో మోహరించాలి..కానీ వైసీపీ అధినేత మాత్రం తన చుట్టూ తిప్పుకున్నాడు..ఎక్కడికి వెళితే అక్కడికి..తాను ఏం చేస్తే ఆ పని చేయించారు. 

* ప్రచారం తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నడిరోడ్డుపై "కాల్చాలి..ఉరి తీయాలంటూ" చేసిన వ్యాఖ్యలు జనాల్లోకి బాగా వెళ్లాయి..

* ఇక మైక్ దొరికితే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయే రోజా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళ, మంత్రి భూమా అఖిలప్రియ వస్త్ర ధారణ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు..వైఎస్ వేసిన రోడ్లపై సీఎం తిరుగుతున్నారనడం, నారా లోకేష్‌ను వాడు-వీడు అనడం ఇలాంటి మాటలు వైసీపీకి చేటు చేశాయి.


* ప్రతిపక్షం అంటే విమర్శించడం ఒక్కటే పనిగా పెట్టుకోవాలి. ఈ మూడున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందనో ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబును జనం ముందు దోషిగా నిలబెట్టవచ్చు కానీ ఇదేమీ చేయకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు జగన్.


* ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి అక్కడ టికెట్ రాలేదన్న అక్కసుతో వైసీపీలోకి వచ్చిన శిల్పా బ్రదర్స్‌‌ జనానికి నమ్మకం కలిగించలేకపోయారు. శిల్పా చక్రపాణి లక్షలాది మంది సమక్షంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా వారు నమ్మలేదు..బహుశా రేపు వైసీపీ తరపున గెలిచి మళ్లీ గోడ దూకరన్న గ్యారంటీ ఏంటీ అని జనం అనుకోని ఉండవచ్చు.

* నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలను దశాబ్ధాల పాటు మకుటం లేని మహారాజు‌లా ఏలారు భూమా నాగిరెడ్డి. మంచి చేశాడో..చేడు చేశాడో ఏమైతే ఏంటీ. ఆ ప్రాంతానికి పెద్ద దిక్కులా ఉన్నారు భూమా. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు సహజంగానే సానుభూతి ఉంటుంది. దానిని టీడీపీకి దక్కకుండా చేయడానికి భూమా ఫ్యామిలీపై లేనిపోని విమర్శలు చేసింది వైసీపీ. ఇంకేముంది పాపం తల్లితండ్రీ లేని ఆడకూతుళ్లు ఎంత కష్టపడుతున్నారో..ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని నంద్యాల ఓటరు భావించి ఉండవచ్చు.

* నంద్యాల ఎన్నికలను ఎప్పటి నుంచో ప్రభావితం చేస్తోన్న గోస్పాడు మండలంలో పెద్ద దిక్కుగా ఉన్న గంగుల బ్రదర్స్‌‌కి జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గంగుల ఇంపార్టెన్స్ తెలుసుకున్న సీఎం చివరి నిమిషంలో గంగుల ప్రతాపరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి లాభపడ్డారు.


* లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ప్రశాంత్ కిశోర్. 2019 ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తాడన్న నమ్మకంతో బోలెడు ఖర్చుపెట్టి మరీ "పీకే"ని తెచ్చిపెట్టుకున్నాడు జగన్. పాపం రాష్ట్రమంతా సర్వే చేసిన ప్రశాంత్ దేవినేని అవినాష్‌ను కాపు అని...వంగవీటి రాధాను కమ్మ అని నివేదిక ఇచ్చాడట. ఉత్తరాదికి చెందిన ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లోని కుల సమీకరణలు, లెక్కలు గురించి కనీస అవగాహన లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నంద్యాల లెక్క కూడా అలాగే తప్పి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.