మద్యం కుంభకోణం దర్యాప్తు వేగం: జగన్ లో పెరుగుతున్న భయం.. కేంద్ర పెద్దలను శరణు జొచ్చే ప్రయత్నం.?

Publish Date:Sep 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు జగన్ మెడకు చుట్టుకుంటోందా? ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు, విచారణలో జగన్ సన్నిహితులు వెల్లడిస్తున్న వివరాల మేరకు  ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే అన్న అనుమానాలు పెంచేవిగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఈడీ దర్యాప్తు  ఏ క్షణంలోనైనా తాడేపల్లి ప్యాలెస్ తలుపుతట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆయనలో భయాన్నీ, కంగారునూ ఎత్తి చూపుతోందని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి ఆయన డిస్పరేట్ గా దారులు వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోందంటున్నారు. డీఎస్సీ అవకతవకల పేర  నిరుద్యోగులను రెచ్చగొట్టి మద్యం కుంభకోణంలో వెలుగులోకి వస్తున్న వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నంగానే పరిశీలకులు చెబుతున్నారు.  అంతే కాకుండా   రాజ్ భవన్‌కు పరుగులెత్తి గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించడం వంటివి ఆయనలోని భయాన్నీ కంగారునూ ఎత్తి చూపుతున్నాయంటున్నారు.  

జగన్ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్, ఈడీలు ఏకకాలంగా ేస్తున్న దర్యాప్తు ఈ కుంభకోణం మూలల వద్దకు వేగంగా చేరుతంది. ముఖ్యంగా ఈడీ దర్యాప్తు వేగం..ఈ కుంభకోణలో మనీ ట్రయల్ చిక్కుముడులను విప్పుతోంది. ఈ వ్యవహారంలో దాదాపుగా ఈడీ దర్యాప్తు కొలిక్కి వచ్చేసినట్లేని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టడం ఇంకెంతో దూరంలో లేదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

ముందుగా మద్యం కుంభకోణం వ్యవహారంలో   ఆరథిక వ్యవహారాలను చక్కబెట్టిన, జగన్‌కు అత్యంత సన్నిహితుడు,   సమీప బంధువు అయిన అనిల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ముడుపుల సేకరణ, వాటిని హవాలా మార్గాల్లోకి మళ్లించడం వెనుక కీలక సూత్రధారిగా భావిస్తున్న అనిల్ రెడ్డిని ఈడీ ఏ క్షణంలోనైనా విచారణకు పిలవడమో, అదుపులోకి తీసుకోవడమో జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్వీయరక్షణ కోసం జగన్ దూకుడు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రం చేశారంటున్నారు.

అదే సమయంలో కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.

ఇక ఇప్పుడు రిలయన్స్ గ్రూప్  ప్రతినిధి పరిమళ్ నత్వానీ ద్వారా కేంద్ర పెద్దలను శరణు జొచ్చే ప్రయత్నాలు జగన్ మ ముమ్మరం చేశారంటున్నారు. పరిమళ్ నత్వానీ ఎందుకంటే.. జగన్ హయాంలో పరిమళ్ నత్వానీని రాజ్యసభకు ఎంపిక చేశారు. అందుకే ఇటీవల బెంగళూరులో జగన్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.   

[AP Liquor Scam, YS Jagan Mohan Reddy, Enforcement Directorate, Andhra Pradesh Politics, YCP Tenure,  Telugu One]

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.