ఎన్నికల సంఘంపై జగన్ ట్వీట్: ద్వంద్వ వైఖరి అంటూ విపక్షాల విమర్శ.!

Publish Date:Sep 26, 2026

Advertisement

ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశంపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు ఆయన ద్వంద్వ వైఖరికీ, ద్వైదీ భావానికీ అద్దం పట్టాయి.    ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  

జగన్ మొదటి నుంచీ ఇదే వైఖరి అవలంబిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ సందర్భంలోనూ ఆ పార్టీ నేతలు వ్యతిరేకించలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల సంఘానికి సంబంధించి చట్ట సవరణ చేయాలంటూ జగన్ చేసిన ట్వీట్ పై బీజేపీయేతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

ఇదే విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎత్తి చూపుతూ జగన్ ను నిలదీశారు.   కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో అన్ని విషయాలలోనూ అనుకూలంగా వ్యవహరిస్తూ.. బయట మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు కనిపించే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. జగన్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. 

జగన్ చేసిన ట్వీట్ కు ఏ ఒక్క రాజకీయ పార్టీ నుంచీ కూడా సానుకూల స్పందన రాకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం విషయంలో ఏ డిమాండ్ అయితే చేస్తున్నాయో అదే డిమాండ్ జగన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జగన్ ట్వీట్ ను స్వాగతించడానికి ఏ పార్టీ ముందుకు రావడంలేదు. దీంతో జాతీయ రాజకీయాలలో జగన్ స్థానం ఏమిటి? ఎక్కడ అన్న ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.

జాతీయ స్థాయిలో జగన్ అసలు ఏ పొలిటికల్ కూటమి వైపు ఉన్నారు. ఆయనను కలుపుకుని పోవడానికి ఏ కూటమి సిద్ధంగా ఉందన్న ప్రశ్నలకు.. తాజాగా జగన్ ఎన్నికల సంఘం విషయంలో చట్టసవరణ అంటూ చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను బట్టి జాతీయ స్థాయిలో జగన్ ఏకాకి అని విస్పష్టంగా అర్థమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒకవైపు కేంద్రంపై విమర్శలు చేస్తూ.. మరోవైపు  కేంద్ర ప్రభుత్వానికి మద్దతు నిలిచిన విషయాలను నెటిజనులు గుర్తు చేస్తూ జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు.  


[YS Jagan, Election Commission Controversy, Mahua Moitra, National Politics, YCP chief tweet, Political Support, Double Standards, Telugu One]

By
en-us Political News

  
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.