ఆశలన్నీ జనసేనపైనే: సొంత బలంపై ఆశలొదిలేసుకున్న జగన్.!

Publish Date:Sep 22, 2026

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి తరువాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్లు నాగంభోట్లు అన్నట్లుగా మారింది. తిరిగి క్షేత్ర స్థాయిలో బలోపేతం అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదన్న నిరాశ ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.  వైసీపీ నుంచి కీలక నాయకుల వలసలను నివారించే దిశగా జగన్ ప్రయత్నాలు ఆరంభించారు. తన సహజ వైఖరికి నిరసనగా.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర సహా పలు ముఖ్యమైన ప్రాంతాలకు చెందిన నేతలతో వరుస భేటీలు జరుపుతూ, సంస్థాగత లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. జనసేన  కూటమి ధర్మానికీ, మిత్రధర్మానికీ విరుద్ధంగా స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలలో పోటీకి చేస్తే, ఓట్లు తెలుగుదేశం, జనసేనల మధ్య చీలి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు.  

ఇందులో భాగంగానే  వ్యూహాత్మకంగా.. కూటమిలో అంతర్గత సంక్షోభం తలెత్తిందనే రీతిలో సోషల్ మీడియాలో  పోస్టులు షేర్ చేస్తూ జనసేన స్థానిక సమయంలో ఒంటరి పోరుకు సిద్ధపడుతోందన్న ప్రచారం చేస్తున్నారంటున్నారు. తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు ఉన్నాయన్న సంకేతాలు ప్రజలలోకి వెళ్లేలా ప్రణాళికా బద్ధంగా ఈ ప్రచారం జరుగుతోందని విశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశం కూటమి నుంచి జనసేనను వేరు చేయడం ద్వారా లబ్ధి పొందాలన్నదే వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే  జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలు సృష్టించి స్థానిక సమరంలో లబ్ధి పొందాలన్నది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోందంటున్నారు.  జనసేనకు క్షేత్రస్థాయిలో  బలం లేదని,  ప్రచారం చేస్తూనే, మరోవైపు అదే జనసేన ఓటు బ్యాంకుపై ఆధారపడి స్థానిక ఎన్నికలలో గట్టెక్కాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.  ఒక విధంగా చెప్పాలంటే సొంత బలంపై నమ్మకం కోల్పోయిన వైసీపీ అధినేత పరాన్న జీవిలా.. కూటమిలో విభేదాలను సృష్టించి లబ్ధి పొందే వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతోందని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అందులో భాగంగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదలా ఉంటే జగన్ వ్యూహాలు ఎంత వరకూ ఫలిస్తాయన్న అనుమానాలు వైసీపీ శ్రేణులలోనే వ్యక్త మౌతున్నాయి.  జగన్ ఎత్తుగడలు, వ్యూహాలు అన్నీ సొంత పార్టీని బలోపేతం చేసేందుకు కాకుండా, ప్రత్యర్థి పార్టీలలో విభేదాలు సృష్టించేందుకు అన్నట్లుగా ఉండటంతో వైసీపీ కేడర్ లో అయోమయం నెలకొన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నుంచి నేతల వలసలను ఆపడం విషయంపై పెద్దగా దృష్టి సారించని జగన్.. కీలక సమయంలో విదేశీ పర్యటన పెట్టుకోవడం, వ్యూహాలన్నీ సోషల్ మీడియా పోస్టులపైనూ పెట్టడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ నిస్తేజంగా మారిపోయిన పరిస్థితి నెలకొందంటున్నారు. 

[AP Local Elections 2026, YS Jagan Mohan Reddy strategy, Janasena Party vote bank, YSRCP political moves AP, Pawan Kalyan,  coalition politics, Telugu One] 

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.