మురసు తుఫానుతో ఏపీకి రూ.1,918 కోట్ల నష్టం.!

Publish Date:Nov 5, 2026

Advertisement

నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!

మురసు తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావంతో ప్రాథమికంగా రూ.1,918.55 కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

 వ్యవసాయ, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల పరిధిలో జరిగిన నష్టంతో పాటు సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన నేపథ్యంలో ప్రజలు, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారుల మరమ్మతులు, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం తాను స్వయంగా తుఫాను ప్రభావిత, ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. నష్టంపై సమగ్ర నివేదికను త్వరగా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.

వ్యవసాయ రంగానికి భారీ నష్టం.!

అధికారులు వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. తుఫాను కారణంగా 1,43,122 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 1,86,063 మంది రైతులపై ప్రభావం పడింది. మరోవైపు 6,749 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతినగా, 12,586 మంది రైతులు నష్టపోయారు. వర్షాలు, వరదల కారణంగా 983 ఇళ్లు, 346 బోట్లు, 220 వలలు దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంటలకు సంబంధించి వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు 48 నుంచి 72 గంటల సమయం అవసరమని అధికారులు తెలిపారు.

విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి.!

తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ప్రభావితమైన 1,103 11 కేవీ ఫీడర్లలో 871 పునరుద్ధరించగా, మరో 232 పునరుద్ధరించాల్సి ఉంది. దెబ్బతిన్న 3,946 విద్యుత్ స్తంభాల్లో 1,493 స్తంభాల మరమ్మతులు పూర్తయ్యాయి. ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 11 కేవీ ఫీడర్ల పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో దెబ్బతిన్న 25 హైటెన్షన్ ఫీడర్లలో 21 పునరుద్ధరించారు.

మరోవైపు ఆర్‌అండ్‌బీ పరిధిలో 760.10 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులు దెబ్బతిన్నాయి. 206 ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లను తొలగించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పరిధిలో 74 గ్రామీణ రహదారులు దెబ్బతినగా, 204.14 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లింది. వీటి పునరుద్ధరణకు రూ.92.08 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.

టెలికాం సేవలు 97 శాతం పునరుద్ధరణ.!

తుఫాను ప్రభావంతో నిలిచిపోయిన టెలికాం సేవలను కూడా అధికారులు వేగంగా పునరుద్ధరిస్తున్నారు. గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,428 టవర్లకు గాను 30,518 టవర్లు తిరిగి పనిచేస్తున్నాయి. దీంతో 97.1 శాతం టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. బాపట్ల, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టవర్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 59 మండలాలు, 649 గ్రామ పంచాయతీలు తుఫాను ప్రభావానికి గురయ్యాయి. 336 ప్రాంతాల్లో గుర్తించిన డ్రైనేజీ అడ్డంకులను పూర్తిగా తొలగించారు. పారిశుద్ధ్య పనుల కోసం 5,515 బృందాలు, 1,489 జనరేటర్లను వినియోగిస్తున్నారు. వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయిన పది ప్రాంతాల్లో ఎనిమిదింటికి రాకపోకలను పునరుద్ధరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి.

వరద ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ.!

ప్రధాన జలాశయాలు, కాలువల్లో వరద ప్రవాహాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. ప్రకాశం బ్యారేజీకి 43,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, 70 గేట్లకు గాను 60 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా 6,047 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. 

తమ్మిలేరు ఇన్‌ఫ్లో 26 వేల క్యూసెక్కుల నుంచి 10,200 క్యూసెక్కులకు తగ్గింది. నల్లమడ డ్రెయిన్‌లో 30,259 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఇక తుఫాను, భారీ వర్షాల కారణంగా బాపట్ల జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు.

బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ.!

తుఫాను సహాయక చర్యల్లో 11 ఎస్‌డీఆర్‌ఎఫ్, 13 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు 390 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రజలకు సుమారు 5.87 కోట్ల హెచ్చరిక సందేశాలను పంపించారు. బాధితులకు 52,768 ఆహార పొట్లాలు, 43,954 తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా 211 వైద్య శిబిరాలను నిర్వహించారు. 

తక్షణ సహాయక చర్యల కోసం ప్రభుత్వం జిల్లాలకు రూ.37 కోట్లు విడుదల చేసింది.దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ, రహదారులు, తాగునీటి సరఫరా వ్యవస్థలతో పాటు ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

దీనిపై స్పందించిన చంద్రబాబు.. బాధితులకు తక్షణ సాయం అందించాలని, పునరావాస చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తుఫాను నష్టంపై పూర్తి స్థాయి అంచనాలు రూపొందించి బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: APPSC: 84 రోజుల పాటు రిసార్ట్‌లో గ్రూప్-1 పత్రాలు..ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు.!

 

[ Murasu Cyclone, Andhra Pradesh Cyclone Damage, Cyclone Losses, Chandrababu Naidu, AP CM Review, ₹1918 Crore Loss, Crop Damage, Farmers Losses, Flood Relief Operations, SDRF, NDRF, Electricity Restoration, Road Repairs, Telecom Services, Andhra Pradesh Government, Cyclone Relief Measures, Amaravati News ]

By
en-us Political News

  
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.