పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.!

Publish Date:Nov 4, 2026

Advertisement

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా   పులివెందులలో   ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  

పులివెందుల నియోజకవర్గం పరిధిలోని ఆర్‌.తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ,  వైసీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ఈ వివాదం ముదిరిన క్రమంలో జరిగిన రాళ్లు, సీసాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.  మరోవైపు, ఎర్రిపల్లి ప్రాంతంలో ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ ఆందోళనకు దిగడంతో అక్కడా ఉద్రిక్తత నెలకొంది. అలాగే లింగాల మండలం పార్నపల్లెలోనూ  ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అక్కడ   పోలింగ్ ప్రక్రియ  ప్రారంభం కాకముందే పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల  వ్యవహారంపై వివాదం తలెత్తింది. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను బూత్‌లోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ వైసీపీ   పెద్దఎత్తున ఆందోళనకు దిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ పార్నపల్లెకు బయలుదేరిన కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు  వైయస్ అవినాష్ రెడ్డిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ   వాతావరణం మరింత వేడెక్కింది.

అలాగే పెద్దముడియం మండలం గుండ్లకుంట పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి టీడీపీ ఏజెంట్లను బయటకు తోసేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గుంపును చెదరగొట్టారు.

 ఈ పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అప్రమత్తమైంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.  

[Tenssion in Pulivendula, MPTC ZPTC Elections AP, TDP YCP Clash Pulivendula,  Kadapa District, AP Politics, Telugu One] 

By
en-us Political News

  
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను  ఈ సందర్భంగా చంద్రబాబు  ప్రధానికి  వివరించారు.
ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై  లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.  ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.  
న్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి  దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం  ఆ పార్టీకి ఇదే  తొలిసారి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా.. తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.