నకిలీ రికార్డులను సృష్టించి విలువైన భూములను ఆక్రమించుకున్న మదనపల్లెకు చెందిన కిలేడి, రౌడీషీటర్ కోనేటి సులోచనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సులోచనతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూములు ఆక్రమణ వంటి ఎదుర్కొంటున్న సులోచన అరెస్టు స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసుకు సంబంధించి బాధితుడు మార్పూరి శ్రీరామ్ ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అంతటితో ఆగకుండా, సదరు భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన నిందితులు అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి బలవంతంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే వేరే కేసులో మదనపల్లె సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న కోనేటి సులోచనతో పాటు ఆమె అనుచరుడు గుండిగల మోహన్, రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రియల్టర్ కడియాల శ్రీరాములు నాయుడులను పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని త్వరలోనే అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితురాలైన కోనేటి సులోచనతో పాటు కడియాల శ్రీరాములు నాయుడులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
[Madanapalle Lady Don Koneti Sulochana Arrest, Fake Documents, Kadapa District, Pulivendula, Madanapalle Rowdy Sheeter Sulochana]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madanapalle-lady-don-koneti-sulochana-arrest-43-236357.html
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానికి వివరించారు.
ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.
న్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం ఆ పార్టీకి ఇదే తొలిసారి. మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా.. తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.