ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ కేంద్రంలో టీచర్ దుర్మరణం.!

Publish Date:Nov 5, 2026

Advertisement

హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!

అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు విషాదాన్ని నింపాయి. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా పోలింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చిన ఓ ఉపాధ్యాయురాలు.. విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన హరిత గౌడ్ (58) మృతి చెందడంతో తోటి ఎన్నికల సిబ్బంది, ఉపాధ్యాయ వర్గాల్లో విషాదం నెలకొంది.

గుంతకల్లుకు చెందిన హరిత గౌడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆమెకు కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో బాధ్యతలు అప్పగించారు. గురువారం ఉదయం విధుల్లో ఉన్న సమయంలో ఆమెకు బీపీ, షుగర్ స్థాయిలు తగ్గడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు, ఆయాసం మొదలయ్యాయి. 

దీంతో తన ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి వెళ్లాలని అక్కడే ఉన్న తోటి సిబ్బందికి తెలిపారు.అయితే ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన అనుమతి కోసం వేచి చూస్తుండగానే హరిత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న ఎన్నికల సిబ్బంది వెంటనే స్పందించి వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించారు. 

అనంతరం ఆమెను కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు హరిత తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.ఎన్నికల విధుల్లో ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న సహోద్యోగి ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో తోటి సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు. 

కుటుంబ సభ్యులకు తీరని విషాదంమిగిల్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మరోవైపు పోలింగ్ అధికారి హరిత మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఇవి చదవండి: https://teluguone.com/news/content/winter-health-tips-25-236401.html

 

 

 

[ Anantapur News, Polling Officer Haritha Death, Election Duty Death, Andhra Pradesh Elections, Kuderu News, Chandrababu Naidu, Teacher Death, Polling Duty Tragedy ]

By
en-us Political News

  
రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.