వేగంగా కోలుకుంటున్న రాప్తాడు బాధితురాలు: సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మంత్రి లోకేష్.!

Publish Date:Nov 5, 2026

Advertisement

సంచలనం సృష్టించిన రాప్తాడు పాఠశాల దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన పదవ తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్యం   కుదుటపడుతోంది. బెంగళూరులోని ప్రసిద్ధ మణిపాల్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె వేగంగా కోలుకుంటోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.  

దాడి జరిగిన వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, ఆమెను మెరుగైన వైద్యం కోసం   అత్యవసరంగా గ్రీన్ కారిడార్ ద్వారా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇమెకు వైద్యులు   శస్త్రచికిత్సలు నిర్వహించారు.  ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించారు. ఆమె స్వయంగా ఊపిరి తీసుకుంటూ, నోటి ద్వారా తేలిక పాటి ఆహారం తీసుకుంటున్నది.   

అంతే కాకుండా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక   ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటంమే కాకుండా.. స్వయంగా లేచి నడవడానికి  ఉత్సాహం చూపుతోంది.  చిన్నారి మనోధైర్యం వైద్యులనే విస్మయపరుత్సోంది. ఈ వివరాలన్నిటినీ సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి నారా లోకేష్ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో మరింత వేగంగా కోలుకోవాలని   ఆకాంక్షించారు.

రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్,  సత్యకుమార్ యాదవ్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి, వైద్యులతో మాట్లాడి చికిత్స తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం, వైద్య బృందాల సమన్వయం వల్లనే చిన్నారి ప్రాణాపాయం నుండి బయటపడి వేగంగా కోలుకోగలుగుతోందని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: వరుసకు బాబాయ్: పెళ్లికి నిరాకరించిందని బాలికపై కిరాతకం.!

ఇక పోతే రాప్తాడు ఘటన  విద్యా సంస్థల్లో భద్రతా లోపాలపై చర్చకు తెరలేపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా సంస్థల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు  ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాలు మరిన్ని పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇలా ఉండగా రాప్తాడు నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకునే సమయంలో అతడు పోలీసులపై తిరగబడటంతో అనివార్య పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిందితుడి కాలికి తీవ్ర గాయమైంది. అతడి ప్రాణాలకు ముప్పు ఏర్పటంతో కోర్టు అనుమతి తీసుకుని వైద్యులు అతడి కాలు తొలగించారు. 

మీకు నచ్చవచ్చు: రాప్తాడు బాధితుడి కాలు తొలగింపు: అనంతపురం జీజీహెచ్ లో అర్థరాత్రి శస్త్రచికిత్స,!

రాప్తాడు బాధిత బాలికకు అండగా నారా లోకేష్: 48 గంటలు కీలకమన్న వైద్యులు.!

 

[Raptadu Victim Speedy Recovery, Gopika health update, Raptadu school attack, Manipal Hospital Bengaluru, Naralokesh, Telugu One] 

By
en-us Political News

  
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.