ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదల: ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే.?

Publish Date:Nov 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  విద్యాశాఖ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు   శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగం, సంక్షేమ సొసైటీ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇప్పటి నుంచే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఈ నోటిఫికేషన్ పరిధిలో మొత్తం ఖాళీలను మూడు రకాలుగా విభజించారు. సాధారణ పాఠశాలల్లో  2 వేల111 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో 906 స్కూల్ అసిస్టెంట్  1,205 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇక ప్రత్యేక విద్య  విభాగంలో 350 పోస్టులుండగా వీటిలో   150 స్కూల్ అసిస్టెంట్, 200 సెకండరీ గ్రేడ్ టీచర్  పోస్టులు ఉన్నాయి. ఇంకా  వివిధ సంక్షేమ సొసైటీలు, గురుకులాల పరిధిలో ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ విభాగాల్లో మరో 260 పోస్టులను ఈ నోటిషికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

జిల్లా వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. కర్నూలు, ప్రకాశం, వైయస్ఆర్ కడప జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఖాళీలు ఉండగా, ఆ తదుపరి స్థానాల్లో ప్రకాశం, కడప జిల్లాలు నిలిచాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల వ్యాప్తంగా ఉన్న పోస్టుల కేటాయింపు, రోస్టర్ పాయింట్లు మరియు సబ్జెక్టుల వారీగా వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ జిల్లా పోస్టుల వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 అభ్యర్థుల వయోపరిమితి, విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్ మరియు హెల్ప్‌డెస్క్ సమాచారంతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in లో ఉంచారు. దీని ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ సమయంలోనే అభ్యర్థులు తమ కేటగిరీ వారీగా అందుబాటులో ఉన్న ఖాళీలను చూసుకునే  అవకాశం ఉంటుంది.  


[AP DSC 2026 Notification Released, AP Teacher Recruitment, AP DSC Posts Notification,   Online ApplicationAndhra Pradesh School Education Department,Telugu One]

By
en-us Political News

  
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను  ఈ సందర్భంగా చంద్రబాబు  ప్రధానికి  వివరించారు.
ఎన్నిక ఏదైనా, ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు ఆదరిస్తేనే విజయం అన్న తత్వం జగన్ కు బోధపడాలి. కానీ ఆయన జగన్ కదా? అందుకే 2024 ఓటమి సందర్భంగా ఏ ఆరోపణలు చేశారో, 2026 మునిసిపోల్స్ లో పరాజయంపై కూడా అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై  లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.  ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.  
న్నికల్లో విజయంపై ధీమాతో బరిలోకి  దిగినప్పటికీ, ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏబీవీ ఇసుమంతైనా ప్రభావం చూపలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం  ఆ పార్టీకి ఇదే  తొలిసారి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై ఘన విజయం సాధించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.