ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.!

Publish Date:Nov 5, 2026

Advertisement

జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.  . పోలింగ్ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే చెవిరెడ్డిని చేతులు కట్టుకుని మౌనమునిలా మారిపోయేలా చేశారు.  చెవిరెడ్డి తన పాత పద్ధతులతో  పరిషత్ ఎన్నికలలో  గలాటా సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు చేసిన ప్రయత్నాలను భగ్నం చేశారు సుధారెడ్డి.  మైకుల ముందూ, తన అనుచరుల ముందూ వీరావేశం ప్రదర్శించే చెవిరెడ్డి ఎదుట నేరుగా నిలబడిన సుధారెడ్డి ధైర్యం ముందు చెవిరెడ్డి తలవంచుకు నిలబడిపోయారు.  

మంగళం పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడిన చెవిరెడ్డిని ఉద్దేశించి సుధారెడ్డి  ఇద్దరం ఒకే కారులో కూర్చుని అన్ని బూత్‌లకు వెళ్దాం  అంటూ సవాల్ విసిరారు.  అయితే ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక చెవిరెడ్డి తలదించుకున్నారు.  

అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు.  అయితే ఆ ప్రయత్నాన్ని కూడా సుధారెడ్డి అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి మరో పోలింగ్ బూత్ కు వెళ్లి అక్కడ గలాటా సృష్టిస్తారా అని నిలదీస్తూ సుధారెడ్డి తన కాన్వాయ్ లో చెవిరెడ్డి వెనుకే బయలుదేరారు.  చెవిరెడ్డి ఏ ఊరికి వెళ్తే మనం ఆ ఊరికే వెళ్దాం.. ఆయన ఎక్కడ అడుగుపెడితే మనం కూడా అక్కడే దిగుదాం అంటూ చెవిరెడ్డిని నీడలా వెంటాడి ఆయనను కట్టడి చేశారు.  ఆయన వేసే ప్రతి అడుగునూ కట్టడి చేస్తూ సుధారెడ్డి చూపించిన ఈ తెగువతో చెవిరెడ్డి అనుచర వర్గం వణికిపోయింది.

ఒక విధంగా  చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎస్కార్ట్ గా మారారు. ఆయన ఎటు వెడితే అటే వెడుతూ చెవిరెడ్డికి చెమటలు పట్టించారు. చుక్కలు చూపించారు. చెవిరెడ్డి అన్న వెంటే ఉంటానంటూ  ఆయన ఎక్కడక వెడితే అక్కడికి వెళ్లారు. ఎక్కడ నిలబడితే అక్కడే ఆయన పక్కనే నిలబడ్డారు. చెవిరెడ్డి అన్నకు కుర్చీ వేయండంటూ మర్యాదలూ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగాలంటే ముందు చెవిరెడ్డిని నియంత్రించాల్సిన అవసరం ఉందనీ, అందుకే ఆయనతోనే ఉంటానంటూ చెవిరెడ్డిని ఫాలో అయ్యారు. ఈ పరిణామం చెవిరెడ్డి చేతులూ కాళ్లూ కట్టేసినట్లైంది. 

సుధారెడ్డి  పోలీసులను వారి డ్యూటీ వారిని చేయమని సూచిస్తూనే తాను చెవిరెడ్డితోనే పోలింగ్ సరళిని పరిశీలిస్తానంటూ ఆయననే వెంబడించారు. ఈ పరిణామంతో చెవిరెడ్డికి చెమటలు పట్టాయి. అక్కడ నుంచి వెళ్లిపోలేక, ఉండలేక చేతులు కట్టుకుని బిక్కముఖం వేసుకుని అక్కడక్కడే తచ్చాడటం కనిపించింది. తాను చెవిరెడ్డిని ఫాలో కావడానికి కారణాన్ని సుధారెడ్డి వివరించారు. ఉదయమే ఓ పోలింగ్ బూత్ వద్ద చెవిరెడ్డి గలాటా సృష్టించడానికి ప్రయత్నించారని సుధారెడ్డి ఆరోపించారు.

ఆయన నైజమే అదన్న సుధారెడ్డి..  గలాటా సృష్టించి, ఉద్దేశపూర్వకంగా గొడవలను ప్రేరేపించి.. ఆ వీడియోలను ఎన్నికల సంఘానికి పంపి అక్రమాలు  అంటూ ఫిర్యాదు చేస్తుంటారని అన్నారు. మునిసిపల్ ఎన్నికల సమయంలోనూ ఇదే చేశారని ఆమె వివరించారు.  అందుకే అటువంటి పరిస్థితి రాకుండా, చెవిరెడ్డికి గలాటా సృష్టించే అవకాశం ఇవ్వకుండా తానే ఆయనకు ఎస్కార్ట్ గా మారానన్న సుధారెడ్డి, ప్రజలు ప్రశాంతంగా ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు.   సుధారాణి దూకుడుతో చెవిరెడ్డి కుదేలయ్యారు. భయపడ్డారో, ఇంకా అక్కడే ఉంటే ఆబోరు దక్కదనుకున్నారో ఏమో సైలెంట్ గా సైడైపోయారు. 

[Pulivathi Sudharedd  Escort Chevireddy, Parishat Elections, Chandragiri, AP Local Elections, Mangalam Polling Booth, TeluguOne]

By
en-us Political News

  
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను  ఈ సందర్భంగా చంద్రబాబు  ప్రధానికి  వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.