ప్రధానిగా మోడీ పుష్కర కాలం పాలన.. ప్లస్ మైనస్ లు ఏంటంటే?

Publish Date:Aug 25, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో  ప్రధాని నరేంద్ర మోదీ ఓ  మైలురాయిని చేరుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, సుదీర్ఘ కాలం పాటు (డెమెక్రటికల్లీ ఎలెక్టెడ్, లాంగెస్ట్ కంటిన్యూస్లీ సర్వింగ్)    ప్రధానిగా కొనసాగుతున్న నేతగా  ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఒకవైపు ఆర్థిక ప్రగతి మరియు నిర్ణయాత్మక నిర్ణయాలు కనిపిస్తుండగా, మరోవైపు పలు అంశాలపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

ఈ పన్నెండేళ్లూ..  సుస్థిరమైన పాలన అందించడానికి సహకరించిన అంశాలు అలాగే ఈ పన్నెండేళ్లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే  ప్రభుత్వం దేశంలో సాధించిన విజయాలు,    వైఫల్యాలతో పాటు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ అరుదైన ఈ ఫీట్ సాధించడం   ఎలా సాధ్యమైంది?  అసలు ఏంటి ఆయన రికార్డు?   4399 రోజులు అనేది ఇది మాత్రమేనా ఇంకా ఏమనా ఆయన సాధించిన రికార్డు ఉందా? అన్న అంశంపై సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.   

కందుల రేమేష్ విశ్లేషణ మేరకు.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దాదాపు 17 ఏళ్లు, ఇందిరా గాంధీ 16 ఏళ్ల పాటు ప్రధానులుగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, సాంకేతికంగా మోదీ రికార్డును ప్రత్యేకంగా పేర్కొనడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే అధికార మార్పిడిలో భాగంగా నెహ్రూ ప్రధాని అయ్యారు. అంటే అప్పుడు ఆయన ఎలెక్టెడ్ పీఎం కాదు, సెలెక్టెడ్ పీఎం. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952లోనే జరిగాయి. అలాగే ఇందిరా గాంధీ 16 ఏళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ, 1977లో ఆమె పరాజయం పాలై పదవికి దూరమయ్యారు.   ఈ నేపథ్యంలో, వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో నెగ్గి, ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం పరిపాలించిన  ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీది రికార్డే.   

ఇక పుష్కర కాలంగా సుస్థిర పాలన అన్న దానిపై మాట్లాడుతూ కందుల రమేష్..  నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల బీజేపీ బలపడిందని ఆ పార్టీ వారే కాదు.. జనం కూడా భావిస్తున్నారన్నారు. ఇందుకు మోడీ కర్మిష్మా,  ఫాలోయింగ్ కారణమన్నారు. అయితే దీనివల్ల జరిగింది మంచా, చెడా అన్నది పక్కన పెడితే.. మోడీ కారణంగానే బీజేపీ వరుసగా మూడు సార్లు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలిగిందనడంలో సందేహం లేదని అన్నారు. ఇక్కడ చర్చనీయాంశమన్నారాయన. 

అలాగే..  2013-14లో అంటే మోడీ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తతం  4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.

ఇక మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే బడ్జెట్ గణనీయంగా పెరిగింది. జీడీపీలో ఒకప్పుడు 1.7 శాతంగా ఉన్న మూలధన వ్యయం ప్రస్తుతం 3.3 శాతానికి చేరింది.   2 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 11 లక్షల కోట్లకు పైగా నిధులు రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వందే భారత్ రైళ్లు, నూతన విమానాశ్రయాల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు.

 యూపీఐ ద్వారా రోజువారీ డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జనధన్ యోజన ద్వారా కోట్లాది మంది సామాన్యులకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

 రక్షణ, స్పేస్   రంగాలను ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచారు. దీనివల్ల దేశీయంగా అనేక హైటెక్ స్టార్టప్‌లు, డ్రోన్ మరియు శాటిలైట్ తయారీ సంస్థలు రూపుదిద్దుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం మరియు అయోధ్య రామమందిర వివాదానికి సజావుగా ముగింపు పలకడం మోదీ ప్రభుత్వ రాజకీయ సంకల్పానికి నిదర్శనంగా చెప్తుంటారు.

ఇవన్నీ మోడీ సర్కార్ విజయాలు అయితే..  విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  మోడీ అధికారంలోకి రాకముందు రూపాయి విలువను పెంచుతామని చెప్పినప్పటికీ, ఈ పుష్కర కాలంలో అది జరగలేదు సరికదా.. రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చింది. వస్తోంది. బలాధిక్యత కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నిరంతరం తగ్గుతూనే వస్తోంది.

అదే విధంగా పాలనాపరమైన నిర్ణయాలు, ఎజెండా అమలు కారణంగా దేశంలో మత, సామాజిక  పోలరైజేషన్  పెరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద వరుసగా మూడు సార్లు ఎన్డీయే కూటమిని విజయపథంలో నడిపించి, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ముద్రవేశారనడంలో సందేహం లేదన్నారు ప్రధాని కందుల రమేష్. 

Modi 12years rule as PM, Record, Achievements, Failures, Democratically, Elected, Continuously

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.