ఈవీఎంలు సురక్షితమైనవి.. సీఈసీ

Publish Date:Aug 25, 2026

Advertisement

 దేశంలో ఎన్నికల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల  విశ్వసనీయతపై తరచూ వ్యక్తమవుతున్న  సందేహాలకు భారత   ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్  (సీఈసీ) జ్ఞానేష్ కుమార్  వివరణ ఇచ్చారు. భారత ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఈవీఎంలు   సురక్షితమైనవనీ, అవి ఎలాంటి నెట్‌వర్క్‌తోనూ అనుసంధానం కాకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని  స్పష్టం చేశారు. సాంకేతికంగా  ఈవీఎంలలో హ్యాకింగ్ లేదా వెలుపలి నుంచి డేటాను మార్చే అవకాశం లేదని విస్పష్టంగా చెప్పారు. 

 లక్నోలోని  కొల్విన్ తాలూక్దార్స్ కాలేజీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఈసీ  జ్ఞానేష్ కుమార్   విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖీ  మాట్లాడారు.  ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, ఎన్నికల యంత్రాంగం పనితీరు, యువ ఓటర్ల భాగస్వామ్యం తదితర అంశాలపై ఆయన విద్యార్థులు యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈవీఎంల రూపకల్పన, వాటి భద్రతా ప్రమాణాల గురించి ఆయన వారికి వివరించారు.  దేశంలో వినియోగించే   ఈవీఎంలను  ప్రభుత్వ రంగానికి చెందిన అత్యున్నత రక్షణ, ఎలక్ట్రానిక్స్ సంస్థలు  తయారుచేస్తాయన్న ఆయన.. వీటిలో ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి ఎలాంటి వైర్‌లెస్ సాంకేతిక పరికరాలు లేదా రిసీవర్లు ఉండవన్నారు. నెట్‌వర్క్ కనెక్టివిటీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్ల ఇంటర్నెట్ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేయడం,  హ్యాంపర్ చేయడం అసాధ్యమన్నారు. 

దేశంలో   100 కోట్ల మందికి పైగా నమోదిత ఓటర్లు ఉన్నారన్న ఆయన.. ఇంతటి భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహణ గురుతరమైన బాధ్యతగా చెప్పారు.  ప్రశాంతమైన వాతావరణంలో, పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు.

ఎన్నికల నిబంధనలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలకు లోబడే ఈవీఎంల కేటాయింపు, తనిఖీలు,   లెక్కింపు వరకు ప్రతీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే విడతల వారీగా మాక్ పోలింగ్, సీలింగ్ ప్రక్రియలు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతపై ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. 

CEC on EVM Security, CEC Gyanesh Kumar, Indian Election Commission, EVM Hacking Clarity, Lucknow Colvin Taluqdars College

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.