అల్వాల్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. పలువురు అరెస్ట్..!

Publish Date:Sep 14, 2026

Advertisement

సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బాలికను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి గంజాయి, మత్తు పదా ర్థాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యా ప్తులో వెల్లడైంది. మచ్చ బొల్లారానికి చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదువు తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పదో తరగతి చదువుతున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. 

ఆ పరిచయం ద్వారా మరికొందరితో పరిచయం ఏర్పడగా, వారి కారణంగానే పలుమార్లు లైంగిక దాడికి గురైనట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాక్లెట్లలో మత్తు పదార్థం కలిపి కారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక ఆరోపించినట్లు తెలుస్తోంది. అనంతరం మరో వ్యక్తి పరిచయమై మద్యం, సిగరెట్లు, గంజా యికి అలవాటు చేసి కొంపల్లి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన విక్కీ అనే యువకుడు బాలికను గుండ్ల పోచంపల్లిలోని ఓయో హోటల్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ విక్కీతో పాటు మరో ముగ్గురు కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడి నట్లు దర్యాప్తులో తేలింది. మరుసటి రోజు బాలికను షామీర్‌పేట్‌లోని నిర్మాణం లో ఉన్న అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి విక్కీతో పాటు మరో ఇద్దరు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నించడం తో బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం బొల్లారం రైల్వే స్టేషన్‌లో పరిచయమైన వ్యక్తి, అతని స్నేహితుడు గంజాయి ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక ఆరోపించింది. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు ఆమెను ఓయో గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ నెల 10వ తేదీన అక్కడి నుంచి తప్పించు కున్న బాలిక బొల్లారం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే ఆమెను వెంబడించిన నిందితులు గంజాయి ఇచ్చి రైలులో మేడ్చల్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్‌లో ఆగి ఉన్న రైలు బోగిలో విక్కీతో పాటు మరో ఇద్దరు కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం బాలికను ఆటోలో దూల్‌పేట్ వైపు తీసుకె ళ్తుండగా ఆమె కేకలు వేయడంతో నిందితులు అక్కడే వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. 

దీంతో కుటుంబ సభ్యులను ఆశ్రయించిన బాలిక జరిగిన విషయాన్ని వారికి వివరించింది. అనంతరం తల్లిదండ్రులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీ సులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది యువకులతో పాటు గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఓయో హోటల్ మేనేజర్, ఓనర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

 

 

 

[ Minor girl gang-raped in Alwal, Secunderabad, Oyo Hotel Manager, Bollaram Railway Station, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy, Telangana police, Hyderabad police]


 

By
en-us Political News

  
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది.
ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..!
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.