హోటళ్ల లైసెన్సులు రద్దు: ఒక ఫార్సేనా.. ఫుడ్ సేప్టీ అధికారులది ఉత్తుత్తి హడావుడేనా.?

Publish Date:Oct 3, 2026

Advertisement

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, నాణ్యత కొరవడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అన్నీ అని కాదు కానీ పలు హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలకు నీళ్లొదిలి, కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   

టీజీ సేఫ్ దాడులు, సీజ్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ప్రియులు స్వాగతించారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో ధైర్యంగా తినవచ్చని భావించారు. తమ ఆరోగ్యానికి ఢోకా ఉండదని అనుకున్నారు. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్సులు రద్దు చేసినా  కొన్ని హోటళ్లు నేరుగా వినియోగదారులకు కనిపించకుండా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదికల ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి.  

. లైసెన్సు రద్దయిన సంస్థలు ఆహార తయారీ, విక్రయ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు అధికారులు తనిఖీలను మరింత సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు కూడా చెల్లుబాటయ్యే ఆహార భద్రతా లైసెన్సులను ధ్రువీకరించే వ్యవస్థను పటిష్ఠం చేయాలని అంటున్నారు.

ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం కనుక కేవలం దాడులు, సీజ్ లు లైసెన్సుల రద్దతో చేతులు దులిపేసుకోవడమే కాకుండా, లైసెన్స రద్దైన తరువాత కూడా ఆన్ లైన్ ద్వారా సరఫరాలు కొనసాగిస్తున్న వారిపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.  

[Telangana Food Safety, Cancellation Hotel Licenses, Telangana Hotels Restaurants, Food Safety Officials, TG SAFE, Farce, Telugu One]

By
en-us Political News

  
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.