మౌలాలి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ హైటెన్షన్ వైర్లు..!
Publish Date:Sep 14, 2026
Advertisement
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మరికాసేపట్లో చేరుకునే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మౌలాలి సమీపంలో ప్రయాణిస్తున్న సమయం లో ఒక్కసారిగా విద్యుత్ కరెంట్ తీగలు తెగి రైలు పైభాగంపై పడిపోయాయి. కరెంట్‌కు సంబంధించిన మెటీరియల్స్ రైలు పై పడటంతో భారీ ఎత్తున శబ్దం రావడంతో ప్రయాణి కులు ఒక్కసారిగా భయాం దోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక పలు వురు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితిని గమ నించిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై మౌలాలి సమీపంలోనే రైలును నిలిపివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైలును నిలిపివేసిన అనంతరం ఇంజన్ డ్రైవర్ వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. కరెంట్ తీగలు తెగిపడటంతో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే రైళ్ల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తు న్నారు.కరెంట్ తీగలు ఎందుకు తెగిపడ్డాయి? రైల్వే విద్యుత్ వ్యవస్థలో ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? అనే విషయా లపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. సహాయ చర్యలు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంది.. [ Intercity Express Train, Maulali Railway Station, Secunderabad Railway Station, SCR, South central railway ]
http://www.teluguone.com/news/content/-intercity-express-train-24-231406.html





