హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ దందా: గుట్టురట్టు.!
Publish Date:Oct 2, 2026
Advertisement
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగులను పట్టుకుని వాటి దంతాలను కట్ చేయడంతో పాటు, వాటిని అక్రమంగా విక్రయించేందు కు ప్రయత్ని స్తున్నట్లుగా విశ్వసనీయమైన సమా చారం రావడంతో డీఆర్‌ఐ అధికారులు వెంటనే రంగంలోకి దిగి నిఘా పెట్టారు.ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులు ఏనుగు దంతాలు, ఐవరీ వస్తువులు తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. విక్రయానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా డీఆర్‌ఐ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, వాటితో నైపుణ్యంగా చెక్కిన ఐవరీ వస్తువులు (ట్రోఫీలు) స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972లోని సంబంధిత నిబంధనల ప్రకారం వాటిని అధికారులు సీజ్ చేశారు.ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన వస్తువులను విక్రయించడం, వ్యాపారం చేయడం లేదా వాటిని ఉపయోగించడం చట్టప్రకారం నిషేధం.దేశవ్యాప్తంగా వన్యప్రాణుల నేరాల నియంత్రణకు డీఆర్‌ఐ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా వన్యప్రాణులను తరలించడం, రక్షిత జాతులకు చెందిన జంతువుల నుంచి తయారైన వస్తువులను అక్రమంగా రవాణా చేయడం లేదా వాటితో వ్యాపారం చేయడం వంటి వాటిపై నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు మద్దతుగా, వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. [ Illegal sale of elephant tusks uncovered, Hyderabad, DRI officials, Wild Life Protection Act, CM Revanth reddy, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/illegal-sale-of-elephant-tusks-uncovered-24-233185.html




