Bollaram Army Camp: ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ట్విస్ట్..మరో 8 మంది అరెస్ట్.!

Publish Date:Oct 3, 2026

Advertisement

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. నిందితుల నుంచి ఏకే-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టల్స్, మ్యాగజైన్లు, భారీగా బుల్లెట్లు, బైనాక్యులర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 31న బొల్లారం ఆర్మీ క్యాంప్‌లోని ఆయుధాగారం, మ్యాగజైన్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించి.. లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవితిర్కర్ ఫిర్యాదుతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాలు కలిసి దర్యాప్తు చేపట్టాయి.సెప్టెంబర్ 11న ప్రధాన నిందితుడు మల్లేష్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి తండ్రి ఇంట్లో గన్నీ బ్యాగుల్లో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టు అనుమతితో మల్లేష్‌ను పది రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో చోరీ వెనుక ఉన్న పూర్తి పథకం బయటపడిందని సీపీ సుమతి తెలిపారు.

మల్లేష్ గతంలో మేఘాలయ, జమ్మూ, ఊటీ ప్రాంతాల్లో పనిచేసి.. 2025 వరకు అక్కడ విధులు నిర్వహించిన అనంతరం మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. గతంలో అచ్చంపేటలో అతడిపై రెండు చోరీ కేసులు ఉన్నట్లు కూడా గుర్తించారు. మల్లేష్ మైండ్ సెట్ మొత్తం దొంగతనాలు చేయడమే... రిటైర్మెంట్ తర్వాత ఇల్లు, ఫ్లాట్ నిర్మాణం వంటి వాటికి ఖర్చులు కావడంతో మల్లేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పూర్తయ్యాక సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని తన తమ్ముడు మల్లికార్జున్‌తో కలిసి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మల్లేష్ రిచ్ కావాలని ఫిక్స్ అయ్యి తెఫ్ట్ చేశాడు. మల్లేష్, మల్లికార్జున్, నిరంజన్ కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, ధనికుల ఇళ్లలో భారీ దోపిడీలు చేయాలని స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకుల్లో దొంగతనాలు ఎలా చేయాలనే అంశానికి సంబంధించిన వీడియోలను మల్లికార్జున్.. మల్లేష్‌కు పంపినట్లు సీపీ వెల్లడించారు.


 
2022లో కోల్‌కతాలో ఉన్న సమయంలో మల్లేష్‌కు అక్కడి సివిలియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. అదే సమయంలో బిర్బల్ షా, అవి డే అలియాస్ ఓబీతో పరిచయం ఏర్పడినట్లు చెప్పారు. బిర్బల్ షానే అవి డేను మల్లేష్‌కు పరిచయం చేసినట్లు వెల్లడించారు.అవి డేపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాల అవసరం ఉందని మల్లేష్ వారికి చెప్పినట్లు.. అనంతరం ఆర్మీ ఆయుధాలను తీసుకురావడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన మల్లేష్‌కు అక్కడి సిబ్బందితో పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలను ఉపయోగించుకుని కోట్ ఇన్‌చార్జ్ వినోద్ కుమార్, ప్రవీణ్, శేషులను తన పథకంలోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కోట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న వినోద్‌కు ఆయుధాగారం, సీసీ కెమెరాలు, సెంట్రీ డ్యూటీలు, క్యాంప్‌లోని కదలికలపై పూర్తి అవగాహన ఉండటంతో అతడి పాత్ర కీలకంగా మారిందని సీపీ తెలిపారు. వినోద్ సాధారణ సమయం కంటే ముందుగానే క్యాంప్‌ను సందర్శించేవాడని, ఈ విషయాలను కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

మల్లేష్ డబ్బు ఆశ చూపి వినోద్, ప్రవీణ్, శేషులను తనతో కలుపుకున్నట్లు తెలిపారు. జూలై 14 నుంచి ఆగస్టు 27 వరకు మల్లేష్, వినోద్ ఒకే లొకేషన్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. మల్లేష్ స్కూటీపై ఆర్మీ క్యాంప్‌లోకి వెళ్లి రాడ్‌తో ఆయుధాగారం తాళాలు పగులగొట్టి ఆయుధాలను చోరీ చేశాడు. చోరీ పూర్తయిన అనంతరం కామ్ హోగయా అంటే ప్రవీణ్‌కు మెసేజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.చోరీ అనంతరం మల్లేష్ తన వాట్సాప్ కాల్స్‌తో పాటు ఇతర కాల్ వివరాలను డిలీట్ చేసినప్పటికీ.. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. మల్లేష్ నుంచి వినోద్‌కు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో రూ.లక్ష ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. మరోవైపు ఒక పిస్టల్ కనిపించడం లేదంటూ వినోద్ ఫిర్యాదు చేయడం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చినట్లు వెల్లడించారు. చోరీ చేసిన ఆయుధాలను కోల్‌కతాకు చెందిన ముఠాకు విక్రయించేందుకు ముందుగానే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో పిస్టల్‌కు సుమారు రూ.3 లక్షలు, పెద్ద రైఫిల్‌కు రూ.5 లక్షల చొప్పున ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.బిర్బల్ షాకు మల్లేష్ ఆర్మీ నుంచి ఆయుధాలు తీసుకురానున్న విషయం ముందుగానే తెలుసని పోలీసులు తెలిపారు. 

అవి డే, బిర్బల్ షాల ద్వారా ఆయుధాల విక్రయానికి మార్గం ఏర్పడినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎలాంటి ఉగ్రవాద లేదా తీవ్రవాద సంబంధాలు లేవని సీపీ సుమతి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయుధాలు చోరీ జరిగిన ప్రాంతంలో చాలా రోజుల నుండి సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపారు. భారీ ఆస్తి నేరాలకు పాల్పడి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే మల్లేష్ ఆయుధాలను చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అయితే నిందితుడు శేషు పాకిస్థాన్‌కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. ఈ అంశంపై కూడా పరిశీలన చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఉగ్రవాద సంబంధాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్, సిపాయి కొండూరు శేషులు, నాయక్ వినోద్ కుమార్, హవల్దార్ కూచరకంటి ప్రవీణ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవి డే అలియాస్ ఓబీ, బిర్బల్ షా, మల్లేష్ బంధువు ఉప్పుతోళ్ల మల్లికార్జున్, కిరాణా వ్యాపారి చెమ్మకార నిరంజన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఐదు మ్యాగజైన్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, ఆరు 9ఎంఎం ఆటో పిస్టల్స్, 12 మ్యాగజైన్లు, ఒక సివిల్ 6.35 బోర్ పిస్టల్, మూడు బైనాక్యులర్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 1,156 9ఎంఎం పిస్టల్ రౌండ్లు, 720 ఏకే-203 రౌండ్లు, 36 ఇన్సాస్ రౌండ్లు, ఐదు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

 

[ Bollaram Army Camp, Army Weapons Theft, Former Havildar, 8 Arrested, Army Weapons, Bollaram Crime, Secunderabad Crime, Hyderabad Crime, Weapons Theft Case, Illegal Weapons, Army Camp Theft, Police Investigation, Arms Theft Case, Telangana Crime ]

By
en-us Political News

  
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.