భూగర్భంలో దాక్కున్నా వదిలిపెట్టం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ఖర్గే హెచ్చరిక. !

Publish Date:Nov 1, 2026

Advertisement

భారత రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిణామాల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.   ఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక ప్రత్యేక ప్రతీకాత్మక సమావేశంలో విపక్ష నేతలు సీఈసీపై బహిరంగ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కోల్పోయి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

తప్పుడు విధానాలతో కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారంటూ మండిపడ్డారు.ఈ ప్రత్యేక వేదికపై మాట్లాడిన ఖర్గే, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు కీలక ఆరోపణలను అధికారికంగా జాబితా చేశారు. పార్లమెంటరీ నిబంధనలను పక్కనపెట్టి ఫారం-6 లో మార్పులు చేయడం, ఓటర్ల జాబితా కేంద్రీకరణ ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తోందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును కాలరాసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ తరహా చర్యలు భవిష్యత్తులో దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్నే మార్చివేస్తాయని, దీనికి బాధ్యులైన వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే, విపక్షాల ఈ వినూత్న నిరసన తీరును అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అత్యున్నత అధికారిపై ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడటం విపక్షాల నిరాశా నిస్పృహలకు నిదర్శనమని కౌంటర్ ఇచ్చింది. 

ఎన్నికల ప్రక్రియను అప్రతిష్టపాలు చేసేందుకే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే తాము ఈ పోరాటాన్ని వీధులకూ తీసుకువెళ్లాల్సి వచ్చిందని విపక్ష నేతలు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని మరింత తీవ్రతరం చేస్తూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్వహించేందుకు ‘ఇండియా’ కూటమి సన్నాహాలు చేస్తోంది.

 

 

[ Mallikarjun Kharge, Gyanesh Kumar, Chief Election Commissioner, CEC Warning, Election Commission of India, Congress, Political Controversy, Election Commission Row, Indian Politics, Kharge Remarks, Delhi Chalo Rally, Voter List Irregularities, India Alliance Protest, Ramlila Maidan Delhi ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.