రాహుల్‌ గాంధీ ప్రధాని అవ్వాలంటే ఆ పని చేయాలి.. అమిత్‌ షా షాకింగ్ కామెంట్స్.!

Publish Date:Nov 1, 2026

Advertisement

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కావాలనుకుంటే జీవితాంతం మాక్‌ పార్లమెంట్‌లోనే ఉండిపోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం రోజున ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి బహిరంగ సభ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. సిక్కు అల్లర్ల బాధితుల గాయాలపై కారం చల్లినట్లుగా ఈ సభ ఉందని వ్యాఖ్యానించారు. చండీగఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

1984 నవంబర్‌ 1న ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను అమిత్‌ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ హింసాకాండలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారని, అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని పేర్కొన్నారు. చిన్నారులు అనాథలయ్యారని, ఎంతోమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ చేసినట్లు చెప్పబడుతున్న 'పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కంపిస్తుంది' అనే వ్యాఖ్యను కూడా అమిత్‌ షా ప్రస్తావించారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

2014 తర్వాతే కేసులపై చర్యలు: అమిత్‌ షా.!

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులపై తిరిగి దర్యాప్తు ప్రారంభమైందని అమిత్‌ షా పేర్కొన్నారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించామని, ఈ ఘటనల్లో తప్పు చేసిన కాంగ్రెస్‌ నాయకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ఇలాంటి హింసాకాండను దేశం గతంలో ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులోనూ చూడకూడదని వ్యాఖ్యానించారు. అబద్ధాలు ప్రచారం చేయడం, అరాచకాన్ని ప్రోత్సహించడం, పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డుపడటమే ప్రతిపక్షాల వైఖరి అంటూ అమిత్‌ షా విమర్శించారు.

ఇండియా కూటమి ర్యాలీపై వివాదం.!

మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ చర్యలను నిరసిస్తూ, ఓట్ల తొలగింపుపై ఆరోపణలు చేస్తూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాంలీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవం రోజునే ఈ సభ నిర్వహించడంపై అమిత్‌ షా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. ఒకవైపు ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతుండగా, మరోవైపు 1984 అల్లర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

 

[ Amit Shah, Rahul Gandhi, Mock Parliament, Prime Minister Remarks, Amit Shah Satire, Congress, BJP, Political Remarks, INDIA Alliance, Indian Politics ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.