తరుముకొస్తున్న జల సంక్షోభం.. ప్రజా భాగస్వామ్యంతోనే అధిగమించడం సాధ్యం.!

Publish Date:Aug 28, 2026

Advertisement

ఇండియాలో అర్బన్ ప్రాంతాల్లో   నీటి సంక్షోభాన్ని సాధారణంగా తక్కువ వర్షపాతం, అడుగంటిన జలాశయాలు, జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు వంటి కారణాలు చెబుతారు. ఈ కారణాలు పూర్తిగా వాస్తవం కాదు. పాక్షిక వాస్తవం మాత్రమే. ఇండియన్ సిటీస్   నీటి కొరతకు ఈ కారణాలతో పాటు..    పాలనా లోపం కూడా కారణమే. వనరుల సుస్థిరత, సమాన పంపిణీ, డిమాండ్ నిర్వహణ, భూగర్భ జలాల పరిరక్షణ, మురుగునీటి పునర్వినియోగం, పౌర బాధ్యతల అసుసంధానంలో పాలకులు విఫలం కావడం ప్రధాన కారణం. 

నీటి భద్రత అనేది ప్రభుత్వ విభాగాలు అందించే వస్తువుగా, పౌరులు  వినియోగించుకునేదిగా మాత్రమే చూడటం సరికాదు. ఇది సమష్టి బాధ్యతగా చూడాలి.   అది లోపించడం దేశమంతటా ఒకేలా ఉంది.  ముంబైలో భారీ వర్షాలు కురిసినా,   నీటి కొరత ఉంటుంది. అలాగే చెన్నైలో ఏటా భారీ వర్షపాతం నమోదైనా నీటికి కటకటే.. అలాగే పూణెలో పుణె వేసవిలో నీటి కొరత, వర్షాకాలంలో వరదలతో సతమతమవ్వడం,  బెంగళూరులో  వర్షపాతం ఉన్నా,  భూగర్భ జలాలు   పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వైరుధ్యానికి ప్రధాన కారణం  పట్టణ ప్రణాళిక  వైఫల్యం.  ఒక నగరంలో  ఎంత వర్షం కురుస్తుంది అనేది మాత్రమేకాక, ఎంత నీరు సద్వినియోగం అయ్యింది. కురిసిన వర్షపాతంలో   ఎంత నీటిని సేకరించి, నిల్వ చేసి, భూమిలోకి ఇంకించి, పునర్వినియోగించి,   పంపిణీ చేస్తున్నారు  అన్నది కూడా చూడాల్సి ఉంది. వర్షపు నీటిని తుఫాను నీరుగా, ఆ తుఫాను నీటిని వరదలుగా, మురుగునీటిని కాలుష్యంగా మారడం అంటే.. అది ఘోరమైన జల నిర్వహణ లోపం అనే చెప్పాలి. 

కర్నాటక రాజధాని  బెంగళూరు ఇప్పుడు ప్రమాదపుటంచున ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఆ నగరంలోని చారిత్రాత్మక సరస్సులు-చెరువుల వ్యవస్థ  ఒకప్పుడు వికేంద్రీకృత నీటి నిర్వహణ వ్యవస్థగా పనిచేస్తూ, నీటి నిల్వకు, భూగర్భ జలాల పునరుజ్జీవనానికి,  వరదల నియంత్రణకు తోడ్పడింది. అయితే నగర విస్తరణ,  ఆక్రమణలు, పరీవాహక ప్రాంతాల క్షీణత,  కాలుష్యం ఆ వ్యవస్థను బలహీనపరిచాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్వీర్యం చేశాయి.  ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణ,  సమాజ భాగస్వామ్యంతో  బెంగళూరులో ఒప్పుడు దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయి.  సరస్సుల సమూహాలు, నివాసితుల సంఘాలు, పర్యావరణ సంస్థలు, ప్రజా భాగస్వామ్యంతో బెంగళూరు గండం నుంచి బయటపడే దిశగా సాగుతోంది. 

సామాజిక యాజమాన్యం లేని సాంకేతికత మౌలిక సదుపాయాల మెరుగునకే దోహదం చేస్తే..   ప్రజా భాగస్వామ్యంతో కూడిన సాంకేతికత  పాలనగా మారుతుంది. అంటే..  ఒక మురుగునీటి శుద్ధి కర్మాగారం, పునరుజ్జీవన నిర్మాణం లేదా పునరుద్ధరించిన సరస్సును పౌరులు అర్థం చేసుకోక, పర్యవేక్షించక, రక్షించుకోక ముందే, అవి సాంకేతికంగా విజయం సాధించినా సామాజికంగా విఫలమవుతాయని అర్ధం. మౌలిక సదుపాయాల కల్పన అవసరమే కానీ,  డిమాండ్‌ను నియంత్రించకుండా సరఫరాను విస్తరించడం రాబోయే సంక్షోభాన్ని   వాయిదా వేయడమే అవుతుంది. అంతే కాకుండా మరింత పెను సంక్షోభాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.  

 ప్రస్తుతం ఇండియాలో నీటి యాజమాన్యం విషయంలో ప్రజా భాగస్వామ్యం   ఆశించదగినది అనే స్థాయి నుండి తప్పనిసరి అనే స్థాయికి చ ేరుకుంది.  ప్రభుత్వం ఒక సరస్సును సంరక్షిత ప్రాంతంగా ప్రకటించినా, కానీ పౌరులు అందులో చెత్త వేయడాన్న,  ఆక్రమించడాన్ని నివారించాలి.   నిబంధనలు వర్షపు నీటి సేకరణను తప్పనిసరి అని ప్రకటించినంత మాత్రాన సరిపోదు.. ప్రజలు ఆచరించాలి. అంటే జలయాజమాన్యంలో ప్రజా భాగస్వామ్యం కీలకంగా మారాలి.     

looming water crisis,  public participation Must toOvercome, Urban Water Shortage

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.