Publish Date:Aug 31, 2012
శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష సభ్యులు ప్రశ్నోత్తర సమయాన్ని అడ్డుకుని కోల్ స్కామ్‌పై చర్చకు పట్టుపట్టారు. బొగ్గు కుంభకోణానికి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభంకాగానే సభ్యులు తమ పట్టును వీడలేదు. బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్ళి నిరసన తెలియజేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై గందరగోళం నెలకొనడంతో సభను సోమవారం నాటికి వాయిదా వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lok-sabha-adjourned-till-monday-24-17024.html
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.