ఇంజినీరింగ్‌లో 20 బ్యాక్‌లాగ్స్‌.. డెలివరీ బాయ్‌ నుంచి పైలట్‌గా ఎదిగిన యువకుడు.!

Publish Date:Oct 17, 2026

Advertisement

కష్టాలను రెక్కలుగా మార్చుకుని.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న యువకుడు. !

జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కష్టాలు ఎంతలా చుట్టుముట్టినా లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదనేందుకు ఓ యువకుడి ప్రయాణం అచ్చమైన ఉదాహరణగా నిలుస్తోంది. కేరళకు చెందిన ముప్పై ఏళ్ల హైజిల్‌ జెబి అనే యువకుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎట్టకేలకు తన బాల్య కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఒకప్పుడు చదువులో వెనుకబడి, ఇరవై బ్యాక్‌లాగ్స్‌తో సతమతమైన వ్యక్తి.. నేడు పైలట్‌ శిక్షణ పొందే స్థాయికి ఎదగడం ఎందరికో ఆదర్శంగా మారింది. త్రిసూర్ జిల్లా కొడుంగల్లూరుకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన హైజిల్‌ చిన్నతనం నుండి విమానాలపై తీవ్రమైన ఆసక్తిని పెంచుకున్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టపడని ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాల్సి వచ్చింది. ఆ రంగంపై ఆసక్తి లేకపోవడంతో పరీక్షల్లో వరుస వైఫ్యాలను ఎదుర్కొని ఏకంగా ఇరవై బ్యాక్‌లాగ్స్‌ను మూటగట్టుకున్నారు. 

అయినప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకుండా పట్టుదలతో వాటిని క్లియర్ చేసి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో భాగంగా అనేక రకాల పనులు చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా కొచ్చిలో జొమాటో డెలివరీ పార్టనర్‌గా సేవలందించారు. ఆ తర్వాత బెంగుళూరులో గణిత ఉపాధ్యాయుడిగా, అలాగే అవసరమైనప్పుడు ట్రక్‌  బస్సు డ్రైవర్‌గా కూడా పనిచేశారు. ఈ తాత్కాలిక ఉద్యోగాల ద్వారా వచ్చిన చిన్నపాటి సంపాదనతోనే తన కుటుంబానికి అండగా నిలిచారు. ఈ ప్రయాణంలో అతనికి వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో దుబాయ్‌లో ఉన్న తండ్రి అనారోగ్యంతో కోమాలోకి వెళ్లడం, ఆ తర్వాత తండ్రి మరణించడం హైజిల్‌ను మానసికంగా కుంగదీశాయి. 

కుటుంబ పెద్ద కొడుకుగా బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుని, అప్పుల భారంతో సతమతమవుతూనే ముందుకు సాగారు.సైన్యంలో చేరాలనే ప్రయత్నాలు విఫలమైనా, కమర్షియల్ పైలట్ కావాలనే తన ప్రధాన లక్ష్యాన్ని మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. పదేళ్ల నిరీక్షణ తర్వాత పరిస్థితులను ఎదుర్కొంటూనే విద్యా రుణాన్ని సమకూర్చుకున్నారు. ఎట్టకేలకు ఫిలిప్పీన్స్‌ దేశంలోని ప్రముఖ ఏవియేషన్ అకాడమీలో చేరి పైలట్ శిక్షణను ప్రారంభించారు. ఒక సాధారణ డెలివరీ ఏజెంట్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే వరకు హైజిల్‌ సాగించిన ఈ ప్రయాణం యువతకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది. విమర్శలను పట్టించుకోకుండా తన చేతలతోనే సమాధానం చెప్పిన ఈ యువకుడి పట్టుదల నేటి తరానికి పెద్ద గుణపాఠం. త్వరలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఒక పూర్తి స్థాయి కమర్షియల్ పైలట్‌గా విమానాన్ని నడిపించాలనేదే ఆయన తదుపరి లక్ష్యం.

 

 

 

[ Kerala man pilot dream, Haizil Jebi story, Zomato delivery boy to pilot, 20 engineering backlogs success, Philippines pilot training, inspirational success story Telugu, Telugu One, Telugu news ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.