అరవింద్ కేజ్రీవాల్ మార్క్'ఫేక్' రాజకీయాలు!

Publish Date:Dec 15, 2016

Advertisement

 

రాజకీయాల్లో కొంత మేర డ్రామా అవసరమే. కాని, రాజకీయమే డ్రామా అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ లాంటి పెద్ద పెద్ద అంశాలు వుండొచ్చు, వుండొకపోవచ్చు. కాని, కనీసం కామన్ సెన్స్ , న్యూసెన్స్ చేయకుండా వుండే డిగ్నిటీ అన్నా వుండాలి. వీటన్నిటికీ తాను అతీతం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. భారీ మెజార్జీతో రెండోసారి ఢిల్లీ సీఎం అయినా ఆయన ఎప్పుడు చూసినా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత లాగే మాట్లాడుతాడు తప్ప ఏనాడూ రాష్ట్ర సీఎంగా వ్యవహరించరు. మోదీని విమర్శించంది రోజు గడవని ఆయన రాను రాను మరీ డ్రామా మాస్టర్ గా మారిపోతున్నారు. తాను  చేసే ఆరోపణల్లో పస ఎంతా అన్నది, వాటి వల్ల తనకి , జనానికి లాభం ఎంతా అని ఆలోచించటం లేదు...

 

మోదీపై అరవింద్ అత్యంత తాజా ఆరోపణ ఆయన విద్యార్హతలు నిజం కాదని! ఇది ఇంతకు ముందే ఏకే ప్రధాని పై గురి పెట్టిన అస్త్రం. అయితే, ఢిల్లీ, గుజరాత్ యూనివర్సిటిల్లో మోదీ సర్టిఫికెట్లు నకిలీ అని ఏ విధంగానూ నిరూపించలేకపోయారు. కోర్టులో కేసు నడుస్తూనే వుంది. కాని, ఇంతలోనే ఢిల్లీ సీఎం తన సహజ శైలిలో మీడియా ముందు విరుచుకుపడ్డారు. మోదీ అసలు చదువుకోలేదని, అందుకే, ఆయన నోట్లు రద్దు చేసి దేశం మొత్తాన్ని సంక్షోభంలో పడేశారని అన్నారు. డీమానిటైజేషన్ ఇబ్బందులు నిజమే కావచ్చు కాని... మోదీ నకిలి సర్టిఫికెట్లకి , డీమానిటైజేషన్ కి లింకు పెట్టడం ఏంటి? అయినా ప్రధానులు, ముఖ్యమంత్రులు చదువుకున్న వారే కావాలని మన రాజ్యాంగంలో లేదు కదా? ఒకవేళ చదువుకున్న ప్రధానే వుంటే నోట్ల రద్దు సక్రమంగా జరిగిపోయేదా? ఇలాంటి అనేక లాజికల్ ప్రశ్నలకి కేజ్రీవాల్ వద్ద సమాధానం లేదు.

 

నరేంద్ర మోదీ మన ప్రతిపక్షలకి నచ్చకపోవచ్చు. అలాగే, దేశంలోని చాలా మంది జనానికి, సంస్థలకి, సంఘాలకి నచ్చకపోవచ్చు. కాని, ఆయన ప్రపంచం ముందు భారతదేశ ప్రధాని. అటువంటి స్థాయిలో వున్న వ్యక్తిని సహేతుకంగా విమర్శించాలి కాని అర్థం పర్థం లేని ఆరోపణలు చేయకూడదు. అది దేశానికే అవమానం. అసలు అరవింద్ చెప్పినట్టు మోదీ నిజంగా చదువుకున్న వాడు కాకపోతే వచ్చిన నష్టం ఏంటి? 2014లో ప్రజలు ఆయన ఏ డిగ్రీ, ఏ యూనివర్సిటీ నుంచి సాధించాడని నిర్ధారించుకుని ఓటు వేయలేదు కదా? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ట్రాక్ రికార్డ్ గమనించి వేశారు. ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారు. కాని, కేజ్రీవాల్ ఇవేవీ పట్టించుకోకుండా.. జనానికి ఎలాంటి ఉపయోగం లేని ప్రధాని విద్యార్హతల అంశం రచ్చ చేయటం డ్రామా మాత్రమే అనిపించుకుంటుంది!

 

ఢిల్లీ సీఎం అయినప్పటికీ కేజ్రీవాల్ దేశ వ్యాప్తంగా వున్న జనం సమస్యల గురించి మాట్లాడితే ఏ మాత్రం తప్పు కాదు. మోదీని విమర్శించినా తప్పు కాదు. కాని, ఆయన గమనించాల్సింది ఒక్కటుంది. ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలని పాలించే ముఖ్యమంత్రులు సహా త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాలని ఏలుతోన్న సీఎంల వరకూ ఎవ్వరూ అవసరానికి మించి పీఎంని తిట్టిపోయటం లేదు. కేవలం కేజ్రీవాలే మాత్రమే ఆయన నిర్ణయాలు మొదలు చదువు వరకూ అన్నిటిని తూర్పార పడుతున్నారు. దీని వల్ల ఖచ్చితంగా లాభం కంటే నష్టం ఎక్కువగా వుండే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు టీవీల్లో హడావిడి కనిపించినా ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశల్ని వదిలేసి కఠిన నిర్ణయం తీసుకునే వీలుంది!

By
en-us Political News

  
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.