కాశ్మీర్ వేర్పాటువాదం : మంచు మాటున వంచన పర్వం!

Publish Date:Aug 22, 2016

Advertisement


కొన్నాళ్ల కింద కాశ్మీర్ అట్టుడికిపోయింది. ఆర్మీపైన అక్కడి అల్లరి మూకలు రాళ్ల వర్షం కురిపించాయి. బుర్హాన్ అనే ఉగ్రవాదిని ఎన్ కౌంటర్లో చంపినందుకు నిరసనగా రోడ్లపైకి వచ్చి వేర్పాటు వాదులు అరాచకం సృష్టించారు. ఆర్మీ కూడా ఆత్మరక్షణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించింది. ఈ మొత్తం గొడవలో చాలా మందే మరణించారు. కాని, నిజంగా కాశ్మీర్ వేర్పాటు వాదం వెనుక నమ్మలేని నిజాలు మీకు తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు!


కాశ్మీర్ విషయంలో మన శత్రువులు కేవలం పాకిస్థాన్ లో లేరు. అంతర్గతంగానే ఎక్కువ వున్నారు. అభ్యుదయవాదులుగా, మేధావులుగా, జర్నలిస్టులుగా చలామణి అవుతూ 'కాశ్మీరియత్' అనే కొత్త పదాలు ప్రయోగిస్తూ యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్నారు. కాశ్మీర్ లో అసలు ఇండియాతో కలిసి వుండేందుకు ఇష్టపడే జనమే లేరన్నట్టు కొన్ని లెఫ్ట్ భావజాలం ముదిరిన న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాని, సత్యం మరోలా వుంది!


కాశ్మీర్ కి ఇండియా జెండా కాకుండా తనదైన ప్రత్యేక జెండా వుంది. ఈ విషయం మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కాని, అక్కడి వేర్పాటు వాదులు తమ నిరసనల్లో భాగంగా కాశ్మీర్ జెండా ఎగురవేయరు. పాకిస్తాన్ జెండా రెపరెపలాడిస్తుంటారు. ఇది దేనికి సంకేతం? కాశ్మీర్ లో వేర్పాటువాదం వినిపిస్తోన్న అరాచక వర్గం నిజంగా స్వేఛ్ఛ కోరుకోవటం లేదు. పాకిస్తాన్ కాసులకు ఆశపడి అమ్ముడుపోతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా ఏదో ఒక రోజు మొత్తం కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ధారదత్తం చేయాలని కుట్రపన్నుతున్నారు. అందుకే, రకరకాలుగా కాశ్మీరీ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా కూడా ఇలా స్వతంత్ర కాశ్మీర్ కావాలని కోరుకుంటున్న జనం ఎంతో తెలుసా? జస్ట్ పదిహేను శాతం! అదెలాగో చూద్దం రండి...
భారతదేశం ఆధీనంలో వున్న జమ్మూ, కాశ్మీర్ మొత్తం విస్త్రీర్ణం 101380 చ.కి. అందులో 15శాతం మాత్రమే వేర్పాటు వాదం వున్న కాశ్మీర్ ప్రాంతం. మిగతా 85శాతం జమ్మూ, లద్ధాఖ్ ప్రాంతాలు. ఇక్కడ ఇండియాకి వ్యతిరేకమైన సెంటిమెంట్ అస్సలు వుండదు.


భారతదేశంలో ఇప్పటి వరకూ హిందూ ముఖ్యమంత్రే లేని రాష్ట్రం జమ్మూ, కాశ్మీర్. కాని, నిజానికి అంతా అనుకున్నట్టు జె అండ్ కే ముస్లిమ్ మెజార్టీ రాష్ట్రం కాదు. అక్కడి 85శాతం ప్రాంతంలో ముస్లిమ్ లు మైనార్టీలే. జమ్మూ, లద్ధాఖ్ లాంటి చోట్లలో హిందువులు, ఇతర వర్గాలే అత్యధికులు. మొత్తం 1.25కోట్లున్న జనాభాలో 69లక్షలు కాశ్మీర్లో, 53లక్షలు జమ్మూలో, 3లక్షలు లద్ధాఖ్ లో వుంటారు. మరో 7.5లక్షలు మంది జమ్మూ, కాశ్మీర్ పౌరసత్వం లేని సెటిలర్స్.


ఇకపోతే 22జిల్లాల మొత్తం రాష్ట్రంలో కేవలం 5జిల్లాలు మాత్రమే వేర్పాటు వాదుల ప్రభావంలో వున్నాయి. అవ్వి శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుల్గాం, పుల్వామాలు. ఇవి కాక 17జిల్లాలు ఎలాంటి వేర్పాటువాదంతోనూ లేవు. అంతే మెజార్టీ ప్రాంతం, ప్రజలు ఇండియాతోనే వుండాలని కోరుకుంటున్నారన్నమాట! అలాగే, ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ జపం చేసే వేర్పాటు వాదులున్న 5జిల్లాలు పాక్ సరిహద్దుకి దూరంగా వుంటాయి. నిజంగా ఆ దేశంతో సరిహద్దు పంచుకునే కాశ్మీరీ జిల్లాలు ఎంత మాత్రం వేర్పాటువాదానికి సహకరించవు. ఇండియాతోనే వుండాలని కోరుకుంటాయి.
జమ్మూ, కాశ్మీర్ జనాభాలో 85శాతం రకరకాల మతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన వారు. వీళ్లెవరూ భారత్ కు వ్యతిరేకం కాదు. ఇందులో ముస్లిమ్ లే అయిన షియాలు కూడా వుంటారు. వీళ్లు ఇస్లాం అనుసరించినా సున్నీ ప్రాబల్యం వున్న పాకిస్తాన్ అంటే అస్సలు ఇష్టపడరు. ఒకింత భయపడతారు కూడా...


కాశ్మీర్ లో షియా ముస్లిమ్ లు కాకుండా రాజ్ పుత్, బ్రాహ్మణ, మహాజన వర్గాలకు చెందిన డోగ్రాలనే సామాజిక వర్గం వుంటుంది. వీళ్లతో పాటూ దారుణంగా హింసకు గురైన కాశ్మీరీ పండిట్లు కూడా ప్రధానంగా వుంటారు. అంతే కాకుండా ఈ హిమాలయ రాష్ట్రంలో సిక్కులు, బౌద్ధులు, గుజ్జర్లు, బకర్ వాల్స్, పహరీస్, బాల్టీస్, క్రిస్టియన్లు, ఇంకా మైక్రో మైనార్టీ వర్గాలు వుంటారు. వీళ్లెవరూ వేర్పాటు వాదానికి అనుకూలం కాదు.   


ఇక మన జాతీయ మీడియాలో ప్రధానంగా వినిపంచే కాశ్మీరియత్ ఒట్టి భ్రమ మాత్రమే. జమ్మూ, కాశ్మీర్లో నిజంగా కాశ్మీరీ భాష మాట్లాడేది 33శాతం జనాబానే. మిగతా వారు డోగ్రీ, గుజ్జరీ, పంజాబీ, లద్దాఖీ లాంటి భాషలు మాట్లాడతారు. కాని, 33శాతం కాశ్మీరీ మాట్లాడేవారే వేర్పాటు వాద హురియత్ ని, ఉగ్రవాద సంస్థల్ని, ఒమర్ అబుద్ధల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ ని, మెహబూబా ముఫ్తీ పీడీపీని కంట్రోల్ చేస్తారు. అంతే కాదు, వ్యాపారాలు, వ్యవసాయం, గవర్నమెంట్లో కీలక పదవులు అన్నీ కూడా ఈ కాశ్మీరీ మాట్లాడే వారి చేతుల్లోనే వుంటున్నాయి. అందుకే, వారి మాటే చెల్లుతూ వస్తోంది.


మొత్తం మీద కాశ్మీర్ లోని సున్నీ ముస్లిమ్ లు తప్ప మిగతా ముస్లిమ్ వర్గాలతో సహా హిందు, సిక్కు, బౌద్ధ మరే ఇతర వర్గం కూడా వేర్పాటు కోరుకోవటం లేదు. అలా కోరుకునే సున్నీ వర్గం కేవలం 15శాతానికే పరిమితం. వాళ్లే పాకిస్తాన్ తో అంటకాగి, ఆర్మీ పై రాళ్లు రువ్వుతూ అల్లకల్లోలం సృష్టిస్తుంటారు. వాళ్లకే మన మీడియా అభ్యుదయవాదం ముసుగులో చేతనైనంత సాయం చేస్తుంటుంది. మొత్తం జమ్మూ, కాశ్మీర్ ఇండియాకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చేసిందని హడావిడి చేస్తుంటుంది. కాని, గొడవంతా జరిగేది 5జిల్లాల్లో మాత్రమే. మిగతా 17 జిల్లాలు మిగతా భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఎలాగ ఈ దేశంలో అంతర్భాగంగా వుండాలని కోరుకుంటున్నాయో అలాగే భావిస్తున్నాయి. వీటిలో 90శాతం పైగా ముస్లిమ్ జనాభా వున్న సరిహద్దు జిల్లాలైన పూంచ్, కార్గిల్ వంటివి కూడా వున్నాయి!

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.