హస్తిన చేరిన కర్నాటకం!

Publish Date:May 26, 2026

Advertisement

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి లేదా మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో..కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.   హస్తిన వేదికగా కన్నడ రాజకీయాలపై హైకమాండ్   కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది. రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న కొన్ని విభేదాలకు స్వస్తి పలికి..  రాబోయే రోజుల్లో  పాలన మరింత ముమ్మరంగా సాగేలా చూసేందుకు హైకమాండ్ నడుంబిగించింది. 

ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో  మంగళవారం ( మే 25)   అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది.  ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా  పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది. ముఖ్యంగా సీఎం పీఠం మార్పిడి లేదా మంత్రివర్గంలో సమూల మార్పులు చేయడం ద్వారా అసంతృప్తిని చల్లార్చవచ్చని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు వర్గాల మధ్య పూర్తిస్థాయి సయోధ్య కుదరని పక్షంలో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో  జరుగుతోంది. కేవలం సీఎం మార్పు మాత్రమే కాకుండా..  రాబోయే రాజ్యసభ స్థానాల భర్తీ, రాష్ట్ర శాసనమండలి (  స్థానాల కేటాయింపు,  మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కూడా ఈ సమక్షంలో   చర్చించనున్నారు. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా హైకమాండ్ ముందుకు సాగుతోంది.

ఈ సందిగ్ధతను తొలగించడానికి అధిష్ఠానం కొన్ని ప్రత్యేక ఫార్ములాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపడానికి, అలాగే   కేడర్‌లో నమ్మకాన్ని పెంచడానికి నాయకత్వ మార్పు అనివార్యమనే కోణంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి ఫార్ములా ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రిని అలాగే కొనసాగిస్తూ, కేవలం మంత్రివర్గంలో మాత్రమే భారీ మార్పులు చేయడం, పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించడం ఒక మార్గంగా కనిపిస్తోంది. అయితే, అంతర్గత విభేదాలు పూర్తిగా సమసిపోవాలంటే రెండో ఫార్ములా ప్రకారం అగ్రనాయకత్వంలోనే మార్పులు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం కూడా సీనియర్లలో వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య అధికార పంపకాలపై లోపాయకారీ ఒప్పందాలు జరిగాయనే వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాలంగా నాయకత్వ మార్పుపై పార్టీ లోపల వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, కొందరు మంత్రులపై వస్తున్న ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. దీంతో  ఇద్దరు అగ్రనేతలను ఒకే వేదికపైకి తెచ్చి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఢిల్లీ వేదికగా   ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

పరిపాలన పరంగా ,  పార్టీ పరంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సామాజిక సమతుల్యత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వివిధ సామాజిక వర్గాల మద్దతుతోనే పార్టీ అధికారంలోకి వచ్చినందున, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలోనూ, ఇతర కీలక పదవుల్లోనూ సముచిత స్థానం కల్పించడమే ఈ కీలక సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.  

 ఒకవేళ అధిష్ఠానం సీఎం మార్పునకే మొగ్గు చూపితే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలవుతుంది. అలా కాకుండా కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో సరిపెడితే, అసంతృప్త నేతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  

ఏది ఏమైనప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నూతన అధ్యాయానికి తెరలేపడం ద్వారా  పాలనను మరింత వేగవంతం చేయాలని, ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవాలని అధిష్ఠానం భావిస్తోంది.   

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.