కంగనా రనౌత్‌పై కేసు నమోదు...ఎందుకంటే.!
Publish Date:Nov 14, 2026
Advertisement
భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ నటి కంచనా రనౌత్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబంపై ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నవంబర్ 10వ తేదీన కంగనా రనౌత్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ అలాగే రాజీవ్ గాంధీల మరణాలపై అత్యంత సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు షేర్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో ఆమెపై పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.షిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. నవంబర్ 13వ తేదీ రాత్రి 7:51 గంటలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. కంగనా రనౌత్ తన పోస్టులలో సోనియా గాంధీని 'మిస్టరీ ఫారిన్ నేషనల్' (విదేశీ మహిళ) అంటూ అభివర్ణించడమే కాకుండా, గాంధీ కుటుంబంలోని వారసుల వరుస మరణాల తర్వాత ఆమె రాజకీయంగా ఎదగడం వెనుక అనుమానాలున్నట్లు ప్రస్తావించారు. సంజయ్ గాంధీ మరణం తర్వాత మేనకా గాంధీని నివాసం నుంచి బయటకు గంటేశారు అనే అంశాలను కూడా ఆ పోస్టులలో లేవనెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శల పరిధిని దాటి, సమాజంలో మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసేలా, ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ కంగనాపై కఠినమైన సైబర్-ఫోరెన్సిక్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన షిమ్లాలోని బలుగంజ్/షిమ్లా వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్లు 196(1)(b), 353(2), మరియు 356(2) కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఆరోపణల నిజానిజాలను నిరూపించేందుకు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మీకు నచ్చవచ్చు: గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ భరోసా.. ప్రతి డెలివరీపై 1 శాతం సంక్షేమ నిధికి.! [ Kangana Ranaut, Gandhi family, Shimla Police, BJP MP, FIR registered, Sonia Gandhi controversy]
మీకు నచ్చవచ్చు: హనీట్రాప్ వలలో మాజీ సైనికుడు: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బ్లాక్ మెయిల్.!
http://www.teluguone.com/news/content/kangana-ranaut-23-237093.html





