కుప్పం ఇక చంద్రబాబు పర్యవేక్షణలోనే.. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కాంచర్ల శ్రీనివాస్ కు ఉద్వాసన

Publish Date:Jun 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం  అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గడ్డ , ఆయన రాజకీయ కోట కుప్పం.  2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో  కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డబ్బు, అంగబలంతో కుప్పం స్థానిక సంస్థలను సైతం కైవసం చేసుకుని, టీడీపీకి గట్టి సవాల్ విసిరారు.

చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి కుప్పంలోనే ముగింపు పలుకుతామంటూ.. వై నాట్ 175 నినాదంతో  ఆ సమయంలో కుప్పం కైవసానికి పడరాని పాట్లు పడింది. అయినా ఫలితం లేకపోయింది. కుప్పం నుంచి చంద్రబాబు 2024 ఎన్నికలలో కూడా విజయం సాధించారు. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటి వరకూ  వరుసగా 8 సార్లు ఘన విజయం సాధించి పట్టు  నిరూపించుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుప్పం రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి రావడం ఇప్పుడు   హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వ అణచివేతను తట్టుకుని..  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న కాంచర్ల శ్రీకాంత్‌కు చంద్రబాబు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన యువ నేతగా శ్రీకాంత్ కుప్పంలో పార్టీని నడిపిస్తారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల  కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం  ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.   ఈ ముగ్గురు నేతల మధ్య ఏర్పడిన అదృశ్య గోడలు పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టేశాయి. ఎంతో ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో కానీ, బహిరంగ సభల్లో కానీ సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనే ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలోని టీమ్ తో  ఇటీవల  కుప్పం నియోజకవర్గంలో ఒక రహస్య సర్వేను నిర్వహించారు. దాదాపు   15 రోజుల పాటు సాగిన ఈ సర్వేలో..  రాబిన్ శర్మ బృందం గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. స్థానిక నాయకుల పనితీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిలు, కార్యకర్తల మనోభావాలను నిశితంగా పరిశీలించి  చంద్రబాబుకు సమగ్ర నివేదిక సమర్పించింది. ఆ నివేదిక అందిన తరువాత.. చంద్రబాబు గత ఆదివారం     కుప్పం నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా కీలక ప్రకటన చేశారు. కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తాననీ, ప్రతి రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా కుప్పంలో పర్యటిస్తానని చెప్పారు. అదే సమయంలో, అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే మరో యువకుడిని కుప్పంలో తన పీఏ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నియోజకవర్గ వ్యవహారాల్లో కార్యకర్తలు, నాయకులు ఈ కొత్త పీఏ సూచనలు, సలహాలు పాటించాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  చంద్రబాబు తీసుకున్న ఈ  నిర్ణయం పట్ల  పార్టీ కేడర్‌ హర్షం వ్యక్తం చేస్తున్నది.  

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.