ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఇక లేరు.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.!

Publish Date:Sep 29, 2026

Advertisement

 ప్రముఖ ఆధ్యాత్మిక గురువు,  వన్‌నెస్  సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ ఇక లేరు. గత కొంత కాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (సెప్టెంబర్ 29)  కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న దేశవిదేశాలలోని ఆయన అనుచరులు, భక్తులు  దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ, అంచెలంచెలుగా ఎదిగి ఆధ్యాత్మిక రంగంలో ఒక ప్రత్యేక శకం సృష్టించిన ఆయన ప్రస్థానం ముగిసింది. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. మొదటిలో సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన తమిళనాడులోని నాథమ్ గ్రామంలో జన్మించారు.   జీవనోపాధి కోసం ఎల్ఐసీలో ఉద్యోగం చేశారు. అయితే ఆధ్యాత్మిక మార్గంపై మక్కువతో ఉద్యోగం మానేశారు. 

 1980ల చివరి దశకంలో ఆయన చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రాంతంలో 'జీవాశ్రమం' పేరుతో ఒక రెసిడెన్షియల్ పాఠశాల  ప్రారంభించారు. అక్కడి నుంచే ఆయన ఆలోచనా విధానం విస్తృతమైంది. కాలక్రమేణా ఆయన తన బోధనలను విస్తరింపజేస్తూ, తనను తాను కల్కి భగవాన్‌గా ప్రకటించుకున్నారు. ఆయన భార్య పద్మావతితో కలిసి చేపట్టిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, భక్తులు వారిద్దరినీ 'అమ్మ భగవాన్' అని కొలవడం ప్రారంభించారు.

కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంస్థ పరిధి కేవలం స్థానిక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.   తిరుపతి జిల్లాలోని వరదయ్యపాళెం మండలం బట్టలవలం కేంద్రంగా  ఏకమ్ క్షేత్రం, గోల్డెన్ సిటీ  రూపంలో భారీ ఆధ్యాత్మిక సముదాయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రాలు, ఆధ్యాత్మిక శిబిరాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను, భక్తులను విపరీతంగా ఆకర్షించాయి.

 ముఖ్యంగా  దీక్ష  అనే భావన ద్వారా భక్తులలో మానసిక ప్రశాంతతను, దివ్యత్వాన్ని పెంపొందించవచ్చనే సిద్ధాంతాన్నికల్కి భగవాన్ ప్రచారం చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి కూడా లక్షలాది మంది అనుచరులు ఈ సంస్థతో మమేకమయ్యారు. కార్పొరేట్ శైలిలో ఆధ్యాత్మికతను బోధించడంలో ఆయన అనుసరించిన పద్ధతులు అప్పట్లో  సంచలనం సృష్టించాయి. ఇండియాలోనే  కాకుండా ఆఫ్రికా, అమెరికా వంటి విదేశాలలోనూ ఈ సంస్థకు  శాఖలు ఉన్నాయి. మానవుడి చేతనను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా  వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. 

అయితే.. కల్కి భగవాన్ ఆధ్యాత్మిక ప్రయాణంలో  వివాదాలు, విమర్శలు కూడా ఎదురయ్యాయి. సంస్థ ఆస్తులకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలు, ఐటీ సోదాలు వంటి అంశాలు మీడియాలోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. అయినప్పటికీ.. ఆయన బోధనలను విశ్వసించే క భక్తుల సంఖ్య మాత్రం ఇసుమంతైనా  తగ్గలేదు.  

ఆయన మరణంతో తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని ఏకమ్ క్షేత్రం వద్ద భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ట్రస్ట్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఆశ్రమంలో ఉంచనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది అభిమానులు, శిష్యులు చివరిచూపు దక్కించుకునేందుకు వీలుగా   ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక సాధారణ ఎల్‌ఐసీ ఉద్యోగి స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో లక్షలాది మందికి మార్గదర్శనం చేసిన  ద ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన కల్కి భగవాన్   ఇక లేరు.  

[Kalki Bhagwan, Vijay Kumar Naidu, Kalki Bhagavan Nomore, Oneness Foundation, Spiritual Guru Death, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.