నిర్దోషిని, మైనర్ ని.. విచారణలో ముంబై ఉగ్రదాడుల దోషి కసబ్ దబాయింపు.!

Publish Date:Sep 29, 2026

Advertisement

భారతదేశ చరిత్రలో   ముంబై ఉగ్రదాడులు  ఒక మహా విషాదం. ఈ దాడులకు పాల్పడిన ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్‌ కు ఈ ఘటన తరువాత దాదాపు నాలుగేళ్లకు ఉరి శిక్ష అమలైంది. ఆ కేసుకుసంబంధించిన విచారణ సందర్భంగా అజ్మల్ కసబ్ యాటిట్యూడ్, విశృంఖల ప్రవర్తన, విచారణ సందర్భంగా నిర్బయంగా ఆసుమంతైనా జంకూ గొంకూ లేకుండా చెప్పిన అబద్ధాలు, కస్టడీలో ఆహారం కోసం డిమాండ్ చేసిన తీరుకు సంబంధించిన వివరాలను ఆ కేసులో  ప్రభుత్వ తరఫు న్యాయవాది  ఉజ్వల్ నికమ్ ఇటీవల వెల్లడించారు. ప్రముఖ టెలివిజన్ చానెల్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నాటి అనుభవాలను ఓ సారి నెమరు వేసుకున్నారు. 

కౌన్ బనేగా కరోడ్ పతి హోస్ట్..  సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నాటి విషయాలను చెప్పమని అడిగిన సందర్భంగ ఉజ్వల్ నికమ్ సంచలన విషయాలు వెల్లడించారు. హోర మారణహోమానికి పాల్పడిన కసబ్ లో కించిత్తు పశ్చాత్తాపం కానీ, భయం కానీ, బెరుకు కానీ కనిపించలేదని గుర్తు చేసుకున్న ఉజ్వల్ నికమ్.. విచారణ కోసం కసబ్ ను న్యాయస్థానంలోకి తీసుకు రాగానే అతడు తదేకంగా నేరుగా తన వైపే చూసే వాడనీ, ఒక విధంగా భయపెట్టాలన్న లక్ష్యం ఆ కళ్లల్లో కనిపించేదని చెప్పారు. అయితే తాను కూడా కసబ్ బాడీ లాంగ్వేజ్, మానసిక స్థితిని అంచనా వేయడానికి అతడిని నిశితంగా గమనించినట్లు చెప్పారు. 

ఇక విచారణ సందర్భంగా కసబ్ తాను ముంబై రావడానికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ను ప్రత్యక్షంగా చూసేందుకేనని చెప్పాడని ఉజ్వల్ నికమ్ చెప్పారు. ఆ సమయంలోకలగచేసుకున్న అమితాబ్ ఒక వేళ కసబ్ తనను కలవడానికి వచ్చి ఉంటే.. ప్రాణాలతో తిరిగి వెళ్లేవాడు కాదనీ, అక్కడికక్కడే తగిన శాస్తి జరిగేదనీ సరదాగా చమత్కరించారు. అమితాబ్ ను చూడడానికి వచ్చానన్న ఒక సంగతే కాదు.. కసబ్ విచారణ సందర్భంగా పలు వింత వింత, విడ్డూరమైన, అసందర్భ ప్రలాపనలు చేసినట్లు ఉజ్వల్ నికమ్ గుర్తు చేసుకున్నారు.  

తాను మైనర్ ను అని నమ్మించడానికి కసబ్ చేయని ప్రయత్నిం లేదని చెప్పిన ఆయన.. కోర్టులో తనను జువైపైల్  జస్టిస్ చట్టం కింద విచారించాలని డిమాండ్ చేశారనీ, దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనికి బోన్ డెన్సిటీ, సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించి వయస్సును నిర్ధారించారని గుర్తు చేసుకున్నారు. 

అంతే కాకుండా తనకు ఉగ్రదాడులతో సంబంధం లేదని కూడా కసబ్ వాదించాడనీ, తనను పట్టుకున్నది రా అధికారులన్న అబద్ధాన్ని బలంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడన్న ఉజ్వల్ నికమ్.. అయితే, దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు తిరుగులేని శాస్త్రీయ ఆధారాలను కోర్టు ముందుంచడంతో కసబ్  పప్పులుడకలేదని చెప్పారు.  దాడులు జరిగి ముగిసినా, కసబ్‌కు ఉరిశిక్ష ఖరారు కావడానికి   నాలుగేళ్ల సమయం పట్టడానికి కారణమేంటన్న అమితాబ్ ప్రశ్నకు ఉజ్వల్ నికమ్ భారత రాజ్యాంగం గొప్పతనమదేననంటూ..  రాజ్యాంగబద్ధమైన న్యాయ ప్రక్రియను పూర్తిగా అనుసరించి,  నిందితుడికి తనను తాను సమర్థించుకునేందుకు తగిన అవకాశాలు, సమయం ఇవ్వడం చట్టపరమైన బాధ్యత, అందుకే శిక్ష ఖరారులో జాప్యం జరిగిందని వివరించారు.

విచారణ ఆరంభంలో తాను  నిర్దోషినని వాదించిన కసబ్, , కస్టడీలో బిరియానీ కోసం గొడవ చేసేవాడనీ, అయితే.. చివరి దశలో మాత్రం తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని ఉజ్వల్ నికమ్ చెప్పారు.  దేశభద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాదుల పట్ల న్యాయవ్యవస్థ  పారదర్శకంగా, నిబద్ధతతో వ్యవహరిస్తుందనీ, నేరు రుజువైన తరువాత కఠిన శిక్ష తప్పదనీ కసబ్ ఉదంతం తేటతెల్లం చేస్తున్నది. 

[Ajmal Kasab, Mumbay, Terror Attacks, Ujjwal Nikam,  Mumbai attacks, Amitabh Bachchan, Kaun Banega Karodpati, Kasab Age , Special Public Prosecutor]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.