షర్మిల కుమార్తె పెళ్లికి జగన్ బెంగళూరు ప్యాలెస్: అనుమతి నిరాకరించిన మాజీ సీఎం.!

Publish Date:Oct 23, 2026

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో  విభేదాలు మరోసారి పెచ్చరిల్లాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంజగన్, ఆయన సోదరి ఏపీపీసీసీ ఛీఫ్  షర్మిల మధ్య  అగాధం  రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా షర్మిల తన కుమార్తె వివాహ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు కుటుంబ విభేదాలనూ, మరీ ముఖ్యంగా జగన్ షర్మిల మధ్య వైషమ్యాలనూ మరోసారి తెరమీదకు వచ్చేలా చేశాయి.  కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెంగళూరులోని కుటుంబ నివాసాన్ని, అదేనండి జగన్ బెంగళూరు ప్యాలెస్ ను వాడుకునేందుకు షర్మిల కోరితే.. అందుకు జగన్ నిర్ద్వంద్వంగా నిరాకరించినట్లు జోరుగా ప్రచారం అవుతోంది.   

ఈ నిర్ణయానికి వెనుక వ్యక్తిగత విభేదాలే కాకుండా, రాజకీయ   కారణాలు కూడా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  గత కొంతకాలంగా జగన్ పై షర్మిల విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారిన షర్మిల.. ఏపీసీసీ అధినేత్రి హోదాలో  జగన్‌పై రాజకీయ విమర్శల తీవ్రత పెంచారు.  ఈ రాజకీయ వైరుధ్యాలు, ఆస్తి పంపకాలలో ఏర్పడిన విభేదాల పీక్స్ చేరి కుటుంబ వేడుకల విషయంలో కూడా ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన షర్మల కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు జగన్ గైర్హాజరయ్యారు. 

కుటుంబ వేడుకలు, వివాహాది శుభకార్యాలు వంటి సందర్భాలలోనూ రాజకీయ, వ్యక్తిగత విభేదాలు అడ్డుపడటం ఇరువురి మధ్యా గ్యాప్ ఎంతగా పెరిగిందో అవగతమయ్యేలా చేస్తున్నది.    కుటుంబ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు కోర్టు కేసులు, వివాదాలు కొనసాగుతున్న తరుణంలో, సొంత మేనకోడలి వివాహ వేడుకను బెంగళూరు ప్యాలెస్ ను నిరాకరించడం ద్వారా జగన్ సొంత సోదరిని ఎంత దూరంగా ఉంచుతున్నారో తేటతెల్లం చేసింది.  

ఈ పరిణామాలు కేవలం వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబ రాజకీయ సమీకరణాలపై కూడా  ప్రభావం చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదలా ఉంటే బెంగళూరు ప్యాలెస్ వివాదం విషయంలో ఇటు జగన్ నుంచి కానీ, అటు షర్మిల నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.  అయితే ఇందుకు సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   

[Jagan And  Sharmila Differences Widened,    Sharmilas Daughter, Wedding, Permission Jagan Bengaluru Palace, Reject, YS Family Disputes, Telugu One]

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.