ఇండోనేషియాలో భారీ భూకంపం: భారత్‌లోనూ భూకంప ప్రభావం
Publish Date:Apr 11, 2012
Advertisement
ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం ప్రభావం భారత తూర్పు తీర ప్రాంతం పైన కూడా చూపించింది. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ, విజయనగరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, అనకాపల్లిలో స్వల్పంగా భూమి కంపించింది. సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. అయితే ఆస్తులకు ప్రాణాలకు ఎటువంటి నష్టమూ సంభవించలేదు. ఈ ప్రభావం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో, అసోంపై కూడా పడినట్లు తెలియవచ్చింది. దీనితో భారత ప్రభుత్వం అండమాన్ నికోబార్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
ఈ రోజు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.9 గా నమోదైంది. భూకంప తీవ్రతకు సుమత్రా దీవి వణికింది. ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బందా ఏస్ ప్రాంతానికి 495 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రం లోపలి భాగంలో 33 కిలోమీటర్ల అడుగున భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా వాతావారణ శాఖ వెల్లడించింది.గతంలో 2004 సంవత్సరంలో సంభవించిన భూకంపం 9.1 నమోదైన సంగతి తెలిసిందే. హిందూ మహాసముద్రం లో సంభవించిన సునామీ లో సుమారు రెండు లక్షల ముఫ్ఫై వేల మంది మృత్యువాత పడ్డారు.
http://www.teluguone.com/news/content/indonasia-earthquake-24-13306.html





