అల్లు అర్జున్ మామపై కేసు నమోదు.. ఎందుకంటే..!

Publish Date:Sep 15, 2026

Advertisement

 నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలోని మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, కొన్ని నిర్మాణా లను ధ్వంసం చేసి టిన్‌షీట్లు ఏర్పాటు చేశారంటూ మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరఫున పెద్దిరాజు ఈ ఫిర్యాదును గచ్చిబౌలి పోలీసులకు అందజేశారు. నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్‌ 130లో మంత్రీ కాస్మోస్ భవనం ఉందని, ఇది ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా గుర్తింపు పొందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ భవనంలో వివిధ బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఉదయం సుమారు 8.40 గంటల సమయంలో మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్‌ నుంచి భవన ప్రాంగణంలోకి ప్రవేశించారు. గేట్‌కు ఉన్న తాళాన్ని పగులగొట్టి, అక్కడి కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసి టిన్‌షీట్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు.ఈ చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి, తమ కార్యకలాపాలకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఘటన భవనంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని, ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేసినట్లు అసోసియేషన్ తెలిపింది.భవనం దక్షిణ భాగంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్, వ్యర్థాల నిర్వహణ షెడ్ ఉన్నాయని అసోసియేషన్ పేర్కొంది. 

సౌత్‌వెస్ట్ కార్నర్ ప్రాంతాన్ని నీటి ట్యాంకర్లు, చెత్త సేకరణ వాహనాల రాకపోకలకు ఉపయోగిస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ ఇంజిన్లు కూడా ఈ మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.ఈ మార్గాన్ని ఆక్రమిస్తే భవనంలోని ఐటీ సంస్థల కార్యకలాపాలకు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భవన భద్రత, అక్కడ పనిచేస్తున్న సంస్థల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి, నిర్మాణాలను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది. 

అలాగే భవనానికి భద్రత కల్పించడంతో పాటు ఐటీ సంస్థల కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను అందజేసినట్లు అసోసియేషన్ తెలిపారు.. అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది....

 

 

 

[ Case registered against Allu Arjuns uncle, K. Chandrasekhar Reddy, Murali Dhar Reddy, Gaddam Ravi, SEZ, Mantri Cosmos Building, Cyberabad Police, Bunny, Telugu News, Telugu One ]

By
en-us Political News

  
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.