కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో బిర్యానీ.. బహార్ బిర్యానీ కేఫ్‌లో దారుణం..!

Publish Date:Sep 16, 2026

Advertisement

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో ప్రమాదకరమైన రసాయన పదార్థాలను ఉపయోగించడం, హోటల్స్, రెస్టా రెంట్లు, కేఫ్‌లలో అశుభ్ర మైన వాతావరణంలో వంటకాలు తయారు చేయడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం వంటి ఉల్లంఘనలు అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా దిల్సుఖ్‌నగర్‌లోని M/s Bahar Biryani Cafeపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 


కేఫ్ కిచెన్‌లోకి అధికారులు ప్రవేశించగానే దుర్వాసన రావడంతో అనుమానం కలిగింది. దీంతో కిచెన్‌ లోని ఆహార పదార్థాలు, నిల్వలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటప డ్డాయి. ముఖ్యంగా కుళ్లిపోయిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన ఇతర ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ టేస్టీ బిర్యానీ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. తనిఖీల్లో వినియోగానికి అనర్హంగా ఉన్న ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు.. మొత్తం సుమారు 50 కిలోల చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన,పాడైపోయిన, ఆహార పదార్థాలను అక్కడికక్కడే డిస్పోజ్ చేశారు. 

బిర్యానీ, ఇతర ఆహార పదార్థాల కోసం వచ్చే వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన కిచెన్‌లోనే ఇంత పెద్ద మొత్తంలో పాడైపోయిన పదార్థాలు బయటపడటం అధికా రులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆహార పదార్థాల నాణ్యతపై మరింత స్పష్టత కోసం యాక్ట్ ప్రకారం వివిధ ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. సేకరించిన నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపిం చారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమ య్యారు.తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు Bahar Biryani Cafe FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు సిఫారసు చేశారు. బిర్యానీ కోసం వచ్చే కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన చోటే.. కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలు, ఎక్స్‌పైర్డ్ ఉత్పత్తులు బయటప డటం దిల్సుఖ్‌నగర్‌లో కలకలం రేపింది.

 

 

[ Bahar Biryani Cafe, Dilsukhnagar, Hyderabad Food Safety, Food Safety Raid, Food Safety Officials, Rotten Chicken, Rotten Mutton, Rotten Prawns, Expired Food, Biryani Cafe, FSSAI License, Food Safety Violations, Hyderabad Restaurants, Telangana Food Safety ]

By
en-us Political News

  
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.