నయీమ్‌ హత్య కేసులో 8 మంది అరెస్ట్.!

Publish Date:Sep 16, 2026

Advertisement

హైదరాబాద్‌ నాగోల్‌ బండ్లగూడలో జరిగిన ఎండీ నయీమ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక ఉన్న పాత కక్షలు, బెదిరింపుల వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను  అరెస్ట్‌ చేశారు. అయితే ఈ హత్యకు ప్రధాన నిందితుడిగా గుర్తించిన కనకం ఉమా మహేష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నయీమ్‌ హత్యకు నిందితులు ముందుగానే పథకం రచించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు ముందు ఖమ్మంలో నిందితులు సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే హత్యకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుని.. అనంతరం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత పథకం ప్రకారం నయీమ్‌పై దాడికి పాల్పడ్డారు. నయీమ్‌పై దాడి చేసిన తీరు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. ముందుగా నయీమ్‌ కళ్లలో కారం పొడి చల్లిన నిందితులు.. అతడిని వెంబడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వేట కొడవలితో నయీమ్‌ తల, చేతిపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా.. ఇనుప పెనంతో తలపై బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. వరుస దాడులతో తీవ్రంగా గాయపడిన నయీమ్‌.. ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.కే

సు దర్యాప్తులో భాగంగా నిందితులు హత్యకు ఉపయోగించిన  వేట కొడవలి, ఇనుప పెనం, సుత్తి మొదలగు ఆయుధాలనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే నిందితులు ఉపయోగించినట్లు గుర్తించిన టయోటా కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు ప్రధాన నిందితుడిగా కనకం ఉమా మహేష్‌ తో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.హత్యకు ముందు జరిగిన సమావేశం నుంచి.. హత్య అనంతరం నిందితులు ఉపయోగించిన వాహనాలు, ఆయుధాల వరకు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా మరోవైపు మృతుడు నయీమ్‌పై గతంలో పలు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షలు, బెదిరింపులే ప్రస్తుత హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఘటన నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు రౌడీషీటర్లు, పాత నేరస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

[Nayeem Murder Case, Police, Arrest, Eight, Prim ,Accused, Obscanding]

By
en-us Political News

  
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.