ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

Publish Date:Sep 15, 2026

Advertisement

టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించ‌నున్న‌ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను కోరారు. తెలంగాణలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, అగా ఖాన్ ఫౌండేషన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V తండ్రి, దివంగత ఆగా ఖాన్-IV మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆగా ఖాన్ ఫౌండేషన్‌పై తమ‌కు అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఫౌండేషన్ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకుని ఇటీవలే ప్రారంభించుకున్న విషయాన్ని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు సీఎం గుర్తుచేశారు. ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో పునరుద్ధరించిన కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రారంభోత్సవంలో తాము కలిసిన విషయాన్ని కూడా ఈ సంద‌ర్భంగా సీఎం ప్రస్తావించారు.

మూసీ పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి..!

మూసీ పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసా, మూసా నదుల సంగమంగా ఏర్పడిన మూసీ ఆక్రమణలకు గురికావడంతో పాటు కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు.మూసీని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని సీఎం కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి చేయాలని ప్రిన్స్ ర‌హీమ్ ఆగా ఖాన్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.


ఫ్యూచర్ సిటీపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V ఆసక్తి..!

30 వేల ఎకరాల్లో భార‌త్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీపై ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V ఆసక్తి కనబరిచారు. ఫ్యూచర్ సిటీని ఎక్కడ నిర్మిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం సింగపూర్ కంపెనీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని వివరించారు. ఫ్యూచర్ సిటీని నెట్-జీరో సిటీగా ఏర్పాటు చేస్తామని, దాదాపు 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఉంటుందని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు తెలిపారు.ఇప్పటికే అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం వెల్లడించారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం..!

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 2.5 శాతం ఉందని, దాన్ని 10 శాతానికి పెంచుతామని తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు భార‌త్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించ‌నున్న‌ట్లు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు సీఎం తెలిపారు. సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V సీఎం ఆహ్వానించారు. సమ్మిట్‌లో 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని, వ్యాపార అవకాశాల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని సీఎం వివరించారు.

విద్యా, పర్యాటక రంగాల్లో సహకారంపై చర్చ..!

ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో వివిధ ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు రామకృష్ణారావు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు వివరించారు.హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు ఇతర యూనివర్సిటీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు. పర్యాటక రంగంలో ఆఅగా ఖాన్ ఫౌండేషన్ పాత్రను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని ఆమె కోరారు.

 

 

 

[ Prince Rahim Aga Khan-V, CM Revanth reddy, Future City, Shamshabad Airport, Telangana
 Tourism, Telangana goverment, Telugu One, Telugu news ]
 

By
en-us Political News

  
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.