ప్రయాణీకుల భద్రతకే పెద్ద పీట: రైళ్లలో రాత్రిళ్లు మొబైల్ ఛార్జింగ్‌పై నిషేధం.!

Publish Date:Oct 29, 2026

Advertisement

ప్రయాణీకుల భద్రత దిశగా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రిళ్లు రైళ్లలో మెబైల్ ఫోన్లు, లాప్ టాప్ ల చార్జింగ్ పై నిషేధం విధించింది. ఈ నేషేధం వెంటనే అమలులోకి వచ్చింది.   రైళ్లలో ప్రయాణించే   ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది.  రైలు ప్రయాణాల సందర్భంగా అర్ధరాత్రి వేళల్లో సంభవించే   అగ్నిప్రమాదాల ముప్పు  నివారించేందుకు గాను ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

రాత్రి పూట ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. రైల్వులు తీసుకువచ్చిన ఈ నూతన నిబంధన మేరకు రాత్రి 11 గంటల నుంచీ ఉదయం 5 గంటల వరకు కోచ్‌లలోని అన్ని రకాల మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లను  మూసిస్తారు.   ఈ మేరకు దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సర్క్యులర్ జారీ చేస్తూ, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలంటూ రైల్వే బోర్డు  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

రాత్రి వేళల్లో  ప్రయాణికులు నిద్రపోతున్నప్పుడు ఛార్జర్లు ఓవర్ హీట్ కావడం,  షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ గుర్తించింది. ఈ క్రమంలోనే  రాత్రివేళల్లో మొబైల్, లాప్ టాప్ ల చార్జింగ్ ను నిషేధించింది.  ఈ నిషేధం సందర్భంగా తాజాగా రైలు ప్రయాణంలో చోటుచేసుకున్న కొన్ని  ఘటనలను ఉదాహరణలుగా పేర్కొంది.  ఒక ప్రయాణికుడు ఛార్జింగ్ పాయింట్‌కు అనుసంధానించిన పవర్ బ్యాంక్ తీవ్రమైన ఓవర్ హీటింగ్ కారణంగా ఒక్కసారిగా అది పేలిపోయి, కోచ్ నిండా దట్టమైన పొగ వ్యాపించిన ఉదంతాన్ని పేర్కొంటూ..  ఇలాంటి భద్రతా లోపాలు  పునరావృతం కాకుండా ఉండటానికి  రాత్రి వేళల్లో చార్జింగ్ పై నిషేధం మాత్రమే ఏకైక పరిష్కారంగా రైల్వే శాఖ భావించి, ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.  

 సాధారణంగా ప్రయాణికులు రాత్రిపూట ఫోన్‌లు, పవర్ బ్యాంక్‌లు, లాప్ టాప్ లను ఛార్జింగ్‌కు పెట్టి నిద్రపోతుంటారు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కూడా ప్లగ్‌లు తీయకపోవడం వల్ల సాకెట్లలో తీవ్రమైన వేడి ఉత్పన్నమై అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా అర్ధరాత్రి వేళల్లో పర్యవేక్షణ తక్కువగా ఉండటం వల్ల  ప్రమాదం జరిగినా వెంటనే గుర్తించే అవకాశం ఉండదు.

 ఈ సమస్యలను అధిగమించడానికే రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ప్రధాన విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలని రైల్వే రక్షణ దళం, సాంకేతిక విభాగాలు సూచించాయి.   ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు. రైళ్లలో రాత్రివేళ ఛార్జింగ్ స్విచ్‌లను నిలిపివేస్తున్నారా లేదా అనేది తనిఖీ అధికారులు ఆకస్మికంగా పరిశీలిస్తారు. నిబంధనలు పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.  


[Indian Railways Ban Mobiles Night Charging, Train Mobile Charging Rules, Railway Board Directives, Train Safety Measures, Indian Railways Charging Port Closure, Laptops, Power Banks, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.