అప్పుడు షర్మిల.. ఇప్పుడు విజయసాయి?
Publish Date:Sep 8, 2026
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన మద్దతుదారులందరినీ శత్రువులుగా మార్చుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆయన కోసం రోడ్డెక్కి పోరాడిన సొంత చెల్లి, తల్లితో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఆ కోవలోకే విజయసాయి రెడ్డి చేరారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు చేదోడువాదోడుగా నిలిచారు. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ పుంజుకుని.. 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారపగ్గాలు అందుకోవడంలో జగన్ అన్ని విధాలుగా అండదండగా నిలిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అటువంటి విజయసారిరెడ్డి జగన్ కు దూరం జరిగారు. పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాలోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ప్రకటించి.. ఏకంగా సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మీడిమా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. ఆ సందర్భంగా తనను రెచ్చగొడితే గుట్టుముట్లు బయటపెడతా తస్మాత్ జాగ్రత్త అంటూ పరోక్షంగా జగన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూస్తే.. జగన్ కు సొంత చెల్లి 2024 ఎన్నికల ముందు శత్రువుగా మారి, ఆ ఎన్నికలలో జగన్ ఒటమిలో తన వంతు పాత్రపోషించారు. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ పునాదులను షర్మిల కదిలించగలగారు. ఆ ఎన్నికలలో సునీత ప్రచారం ఫలితాలపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ 2019 ఎన్నికల ముందు కాలికి బలపం కట్టుకుని తిరిగి ఎలాగైతే ఆ ఎన్నికలలో జగన్ ఘన విజయం సాధించి సీఎం కావడానికి దోహదపడ్డారో.. అలాగే.. 2024 ఎన్నికలకు ముందు సొంత చెల్లినైన తనను జగన్ ఆస్తిపంపకాలలో ఎలా మోసం చేశారో, సొంత బాబాయ్ హంతకులకు జగన్ ఎలా సహకారం అందించారో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన పరాజయానికి కూడా దోహదపడ్డారు. ఇప్పుడు ఇక జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసే పని గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, మద్దతు దారుడూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కుడి భుజంగా వ్యవహరించిన విజయసాయి రంగంలోకి దిగారని చెప్పవచ్చు. 2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర ఇప్పుడు అంత కంటే బలంగా, ప్రభావమంతంగా విజయసాయి పోషించనున్నారన్న మాట. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై సాయిరెడ్డికి పూర్తి అవగాహన ఉంది. జగన్ ఆర్థిక వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఇప్పటికే ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ప్రతిష్టపై సాయిరెడ్డి వెల్లడించే ఏ చిన్న వివరమైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే 2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర, 2029 ఎన్నికలలో విజయసాయి పోషించనున్నారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
[Vijaya Sai Reddy Real Threat To Jagan, Y P internal crisis, AP politics, Sharmila, TeluguOne News]
http://www.teluguone.com/news/content/vijaya-sai-reddy-real-threat-to--jagan-45-230940.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న
ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.





