TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

అక్టోబర్ లోనే స్థానిక ఎన్నికలు: క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్.!

ఏపీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో స్థానిక ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు. ఎన్నికలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదనీ.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని తేల్చిచెప్పారు. మంత్రులు, పార్టీ కీలక నేతల ఉన్నతస్థాయి భేటీలో నారా లోకేశ్ స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. , క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి స్థానిక ఎన్నికలు కీలకమన్న నారా లోకేష్.. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా, పారదర్శకమైన పాలనను అందిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న కూటమి శ్రేణులు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. కేవలం విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. [Nara Lokesh, AP local body elections, Panchayat elections, Andhra Pradesh, TDP alliance clean sweep, AP politics,Telugu One]

Published on: Wed Sep 23, 2026 2:28PM

political-news-img

తెలుగుదేశం గూటికి వైఎస్ సునీత: కడప జడ్పీ చైర్ పర్సన్ ఆఫర్.. లోకేష్ వ్యూహమేంటి?

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలుగుదేశం గూటికి చేరనున్నారా? జగన్ కు పెట్టని కోట లాంటి కడపలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే.. వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ సునీతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు నిర్ణయించుకున్నారా? ఈ మేరకు లోకేష్ చేసిన ప్రతిపాదనకు వైఎస్ సునీత ఓకే చెప్పారా? ఈ ప్రశ్నలకు పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. మంత్రి నారా లోకేష్ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే.. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైఎస్ కుటుంబానికి, వైసీపీకి తిరుగులేని పట్టు, బలం, ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఆ పార్టీని గట్టి దెబ్బకొట్టాలన్న వ్యూహంతోనే లోకేష్ ఈ ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి పీక్స్ చేరుతున్న తరుణంలో లోకేష్ చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రతిపాదనకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికారికంగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం ఏదీ బయటకు రాకపోయినా.. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం వైఎస్ సునీత సైకిలెక్కి జగన్ కు సవాల్ విసరడం దాదాపు ఖాయమైందనే అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం తర్వాత వైఎస్ సునీత న్యాయం కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై రాజకీయంగా, న్యాయపరంగా ఆమె చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టవచ్చని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ భావిస్తున్నాయి. మరోవైపు, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల ప్రాంతంలో ఇలాంటి పరిణామాలు జరిగితే స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యురాలే ప్రత్యర్థి పార్టీ మద్దతుతో బరిలోకి దిగితే అది రాజకీయంగా జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా సునీత తెలుగుదేశం గూటికి చేరతారా అన్న విషయం ఆమె నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఖరారైనట్లు కాదని పరిశీలకులు అంటున్నారు. [YS Sunitha, Nara Lokesh, Lingala ZPTC, Kadapa politics, TDP offer, Telugu Desham Party, Kadapa, ZP Chair Person, AP Politics, Telugu One]

Published on: Wed Sep 23, 2026 11:16AM

political-news-img

నారా లోకేష్ రాక.!

యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు. దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణకు తొలిసారి నియోజకవర్గానికి ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే, మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో సునీతమ్మ మాట్లాడుతూ... రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కనీసం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు బెదరకుండా ధైర్యంతో నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. నాడు అన్న ఎన్టీఆర్ వద్దన్నా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారు. చంద్రబాబు పిలుపుమేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆనాడు కార్యకర్తలే నా వెన్నంటి నడిపించారు. చంద్రబాబు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి, ఒకసారి మంత్రినిచేసి మా కుటుంబాన్ని ఆదరించారు. గత ప్రభుత్వంలో నాపై 22, శ్రీరామ్‌పై 34, కార్యకర్తలపై 20కి పైగా కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఆలోచించాలని లోకేష్‌ను కోరుతున్నా. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. ప్రత్యర్థులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన తగరకుంట ప్రభాకర్ ఆరుగురి బిడ్డలను చంద్రబాబు చదివించి ప్రయోజకులను చేశారు. పరిటాల రవితోపాటు చనిపోయిన వారి పిల్లలను చదివించారు. వాడుకుని పక్కనపడేసే పార్టీ కాదు తెలుగుదేశం. రాప్తాడు నియోజకవర్గంలో 11మందికి కార్యకర్తల సంక్షేమనిధి అందించారు. యువనేత లోకేష్ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ యువగళం పాదయాత్ర చేసి స్పూర్తినిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు, లోకేష్ రెక్కల కష్టం దాగిఉంది. అందువల్లే రాప్తాడులో దాదాపు 25వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో చిన్న సైకోను సాగనంపాలని ప్రజలు,కార్యకర్తలు నిర్ణయించుకొని, ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించే రూ.800 కోట్ల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అందించినందుకు కృతజ్జతలు. రైతులకు త్వరగా పరిహారం అందించాలని కోరుతున్నా. రాప్తాడు మండలంలో జూనియర్ కాలేజి మంజూరు చేయండి. రామగిరిలో హాస్టల్ భవనం, ఆత్మకూరులో కాలేజి మంజూరు చేయండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు వచ్చాకే స్కూళ్లు బాగుపడ్డాయి. చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నారు. మీ ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునీత చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలి..! హిందూపురం ఎంపి బికె పార్థసారధి మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు యువనేత లోకేష్ రాప్తాడు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు పరిటాల రవీంద్ర దివంగతులయ్యాక వచ్చిన ఎన్నికల్లో పార్టీ కేడర్ వెన్నుచూపకుండా 15వేల మెజారిటీతో పార్టీని గెలిపించారు. 2019లో అధికారం కోల్పోయాక బెదిరించారు. రామగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశాం. ఎక్కడా భయపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2019-24లో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు గారు హంద్రీనీవాను 3వేలకోట్లతో విస్తరించి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. యువనేత లోకేష్ యువగళంలో ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల హామీమేరకు పరిశ్రమలు పెద్దఎత్తున ఎపికి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం. మరో 20ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి :శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో లోకల్ బాడీలో అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం. పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లోకి వెళ్లి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. యువగళం రథసారధి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ కేడర్‌కు అభినందనలు తెలిపారు. పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం ధ్యేయం మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటుచేసిన నాయకుడు లోకేష్. గత చీకటి పాలనను ఎదురొడ్డి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజలకు అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, మరోవైపు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తున్న భవిష్యత్ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. [ Nara Lokesh, Paritala Sunitha, Rapthadu, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Paritala Ravindra, Paritala Sriram, BK Parthasarathi, TDP Cadre, Rapthadu TDP, Local Body Elections, Youth Gala, Upper Pennar Project, Telugu One, Telugu News ]

Published on: Tue Sep 22, 2026 5:15PM

political-news-img

శుభలేక ఇవ్వడం వరకే: జగన్ తో సయోధ్యపై షర్మిల క్లారిటీ.!

వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ, కుటుంబ వివాదాలు, విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నేపథ్యంలో జగన్‌ను ఆమె కలిశారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిరువురి మధ్యా సయోధ్య కుదిరిందనీ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే వీటన్నిటినీ ఖండిస్తూ షర్మిల జగన్ తో తన విభేదాలు కొనసాగుతున్నాయని పరోక్షంగానైనా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను జగన్ ను కలిసిన మాట వాస్తవమేననీ, అయితే అది కేవలం తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికేనని విస్పష్టంగా చెప్పారు. తాను జగన్ తో భేటీకి ఎటువంటి రాజకీయ కోణం లేదని కుండబద్దలు కొట్టేశారు. జగన్-షర్మిల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, ఆస్తుల వివాదం కారణంగా గత కొన్నేళ్లుగా ఏ సందర్భంలోనైనా ఒకే సందర్భంలో ఇరువురరూ కనిపిస్తే.. రాజకీయ అర్థాలు వెతకడం మామూలైపోయింది. వారి తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇరువురూ ఇడుపుల పాయలో కలిస్తే.. ఇంకేముందు జగన్, షర్మిల మధ్య సయోధ్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే షర్మిల తన కుమార్తె వివాహానికి జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లడంతో మరోసారి ఆ ప్రాచారం ఉధృతమైంది. ఈ నేపథ్యంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చారు. జగన్‌ను తాను గతంలో ఎప్పుడు కలిశారు, ఇప్పుడు ఎందుకు కలిశారన్న దానిపై ఆమె పూర్తి స్పష్టత ఇచ్చారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలో జగన్‌ను కలిశాననీ, ఆ తరువాత ఇదిగో ఇప్పుడు, తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి కలిశాననీ విస్పష్టంగా చెప్పారు. తమ కుటుంబంలో శుభకార్యానికి జగన్ నుఆహ్వానించడాన్ని రాజకీయ పరిణామంగా చూడకూడదన్నది షర్మిల అన్నారు. , తన కుమార్తె పెళ్లికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని, ఆ క్రమంలోనే జగన్ నూ ఆహ్వానించాననీ పేర్కొన్న షర్మిల ఇందులో ప్రత్యేకం ఏమీ లేదన్నారు. షర్మిల తాజాగా ఇచ్చిన క్లారిటీలో కుటుంబ శుభకార్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసినట్లైంది. తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు. [YS Sharmila, Daughter Marriege, Invitation, YS Jagan Mohan Reddy, YS Anjili Reddy wedding, APCC Chief Sharmila, TeluguOne]

Published on: Tue Sep 22, 2026 3:08PM

political-news-img

వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన వరుపుల సుబ్బారావు.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. వైసీపీ విధానాలు తనకు నచ్చకపోవడంతోనే పార్టీని వీడినట్లు వరుపుల సుబ్బారావు తెలిపారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తనకు తగిన గౌరవం దక్కలేదని అన్నారు. గతంలో వైఎస్ జగన్ తన వయసు ఎక్కువైందని వ్యాఖ్యానించేవారని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే జనసేనలో చేరేందుకు తాను ఎలాంటి పదవి, ప్రత్యేక హామీ లేదా కమిట్‌మెంట్‌ కోరలేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వరుపుల సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం కాకినాడ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాకినాడ జిల్లాలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావు రాజీనామా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పెద్దాపురం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. [ Big shock for YCP, Former MLA Varupula Subbarao, Deputy CM Pawan Kalyan, Kakinada District, Peddapuram, Samarlakota, YS Jagan, YSRCP, Telugu One, Telugu News ]

Published on: Mon Sep 21, 2026 9:10PM

political-news-img

అతి చేశాను.. విచారణలో ప్రశ్న రావణ్ కన్ఫెషన్.!

డిజిటల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యవహరించి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు వారిలో పశ్చాత్తాపం కలిగేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వివాదాస్పద యూట్యూబర్ బాచలకురి జోసెఫ్, అలియాస్ ప్రశ్న రావణ్ తాను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. మతపరమైన మనోభావాలను గాయపరచడం, దేవుళ్లను దూషించడం, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏపీ పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వ్యాఖ్యల తీవ్రతను బట్టి అధికారులు ఈ కేసులో కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ముఖ్యంగా దేశ భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాల కింద ఉపా చట్టంతో పాటు దేశద్రోహ సెక్షన్లను కూడా అతడిపై నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అనుకున్న అతడికి, చట్టం చేతికి చిక్కిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యాయి. పోలీస్ కస్టడీలో భాగంగా అధికారులు జరిపిన విచారణలో ప్రశ్న రావణ్ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. తాను గతంలో చేసిన తప్పులకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక సున్నితమైన అంశాలపై తాను అనవసరంగా అతిగా స్పందించానని, దానివల్ల అనూహ్య సమస్యలను కొనితెచ్చుకున్నానని విచారణాధికారుల ఎదుట అతడు వాపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాస్పద ధోరణులకు దూరంగా ఉండాల్సిందని, ఈ పరిణామాలు తన జీవితంలో పెద్ద గుణపాఠం నేర్పాయని ప్రశ్నరావణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవుళ్లపై అభ్యంతకరమైన వీడియోలపై పోలీసుల ప్రశ్నలకు.. అతడు చేశానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలా విషయాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని ప్రశ్న రావణ్ కన్ఫెస్ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విచారణలో భాగంగా అధికారులు అతడి ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనపై కూపీ లాగారు. ఛానెల్ ఆదాయం, బ్యాంకు లావాదేవీల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలలో చాలా వాటికి అతడు సరైన సమాదానం ఇవ్వలేదని తెలుస్తోంది. [Prashna Ravan, Bachalakuri Joseph, AP Police UAPA Cases, YouTube controversial videos,Social Media Misuse, Confess]

Published on: Mon Sep 21, 2026 3:52PM